చిరుని భారీ మార్జిన్ తో క్రాస్ చేసిన చరణ్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికి కూడా అదిరిపోయే రేంజ్ లో సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే చిరంజీవి తనయుడు అయినటువంటి రామ్ చరణ్ ఇప్పటికే సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నయనతార హీరోయిన్గా నటిస్తోంది.


ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితం మీసాల పిల్ల అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటివరకు ఈ సాంగ్ యూట్యూబ్ లో 79 మిలియన్ వ్యూస్ దక్కాయి. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితం చిక్రి చిక్రీ అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ కి ఇప్పటికే యూట్యూబ్ లో 87 మిలియన్ వ్యూస్ దక్కాయి. దానితో మన శంకర వర ప్రసాద్ గారు మూవీలోని మీసాల పిల్ల సాంగ్ ను భారీ మార్జిన్ తో ఇప్పటికే పెద్ది మూవీ లోని చిక్రి చిక్రి సాంగ్ దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: