ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరో గా నటించాడు. భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... మహేష్ బాబుపి సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను నవంబర్ 27 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడంలో కాస్త విఫలం అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పది రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ పది రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.
10 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 5.43 కోట్ల కలెక్షన్లు దక్కగా , సిడెడ్ లో 94 లక్షలు , ఆంధ్ర లో 2.28 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 10 రోజుల్లో 11.65 కోట్ల షేర్ ... 20.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 10 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.30 కోట్లు , ఓవర్సీస్ లో 2.38 కలెక్షన్లు దక్కాయి. 10 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 15.33 కోట్ల షేర్ ... 28.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 27.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా మరో 12.67 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.