జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్‌.. మరో 10 రోజులు ఆ ఛాన్స్‌?

Chakravarthi Kalyan
హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల సమయాన్ని జీహెచ్ఎంసీ పొడిగించింది. వచ్చే 10 వరకు నగరంలో శిక్షణ శిబిరాలు కొనసాగించాలని కమిషనర్ రోనాల్డ్ రాస్‌  ఉత్తర్వులు జారీ చేశారు. మే 31తోనే వేసవి శిక్షణ శిబిరాలు ముగించాల్సి ఉంది. అయితే మరో 10 రోజులపాటు పొడిగిస్తున్నట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్‌ ప్రకటించారు. సంబంధిత జోనల్ కమిషనర్లు ఈ విషయాన్ని గ్రహించి వేసవి శిక్షణ శిబిరాల్లో అన్ని ఆటలు, ఈవెంట్లను కొనసాగించాలని కమిషనర్ రోనాల్డ్ రాస్‌ సూచించారు.

అంతేకాకుండా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు కూడా అందజేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్‌ ఆదేశించారు. ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా జీహెచ్ఎంసీ క్రీడా విభాగం ఆధ్వర్యంలో366 ప్రాంతాల్లో 44 క్రీడల్లో శిబిరాలను నిర్వహిస్తున్నారు. మొత్తం 37 రోజులపాటు శిక్షణ ఖరారు చేశారు. కమిషనర్ రోనాల్డ్ రాస్‌ ఉత్తర్వులతో మరో 10 రోజులపాటు శిబిరాలు కొనసాగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: