బడ్జెట్ బెంగ : శిష్యుడిలాగే.. బురిడీ కొట్టించిన బాబోర్?

Veldandi Saikiran

* శ్వేత పత్రాల పేరుతో.. పథకాలు డైవర్ట్
* రేవంత్ రెడ్డి కూడా.. పథకాలపై రాంగ్ డైరెక్షన్
* ఆంక్షలు పేరుతో పథకాల్లో కోత
* శిష్యుడిని మించిన గురువు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను తెరపైకి తీసుకువచ్చి...ఎన్నికల కంటే ముందు ప్రకటించిన హామీలను... డైవర్ట్ చేసేసారు చంద్రబాబు. వైసిపి ప్రభుత్వం వైఫల్యాలపై... శ్వేత పత్రాలు రిలీజ్ చేసి... ఏపీ ప్రజలను ఫూల్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

అచ్చం తన శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్లుగానే... అసెంబ్లీలో నాన రచ్చ చేసి... స్కీములను ఎగగొట్టారు.  మొన్న డిసెంబర్లో.. 6 గ్యారంటీలు  అని చెప్పి రేవంత్ రెడ్డి...ముఖ్యమంత్రి అయ్యారు. 10 సంవత్సరాల పాటు... తెలంగాణను కంటికి రెప్పలా చూసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావును.. పక్కనపెట్టి కాంగ్రెస్కు ఓటు వేశారు తెలంగాణ ప్రజలు.

ఎన్నికల కంటే ముందు చెప్పినట్లుగా... 6 గ్యారంటీలను అమలు చేయ కుండా... మొదటగా.. శ్వేత పత్రాల పంచాయతీ పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అనంతరం ఆరు గ్యారెంటీ లపై... అనేక ఆంక్షలు విధించి కోత పెట్టింది. దీంతో కాంగ్రెస్కు ఓటు వేసిన వారు చాలామంది మోసపోయారు. ఇక ఇప్పుడు చంద్రబాబు పాలనలో కూడా అదే పరిస్థితి నెలకొంటుందని... ఏపీ ప్రజలు అంటున్నారు.

సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారంటే.. రేవంత్ రెడ్డి లాగా శ్వేత పత్రాల పంచాయతీ చంద్రబాబు నాయుడు పెట్టారని... విమర్శలు చేస్తున్నారు ఏపీ ప్రజలు. ఒకవేళ ఆ పథకాలు అమలు చేసిన... అనేక కండిషన్లు పెట్టి కోత విధిస్తారని కూడా... రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి పూర్తిస్థాయిలో బడ్జెట్ పెట్టకుండా చంద్రబాబు ఎస్కేప్ ఐ...  పథకాలను కూడా డైవర్ట్ చేశారని అంటున్నారు. దీంతో ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: