రజినీకాంత్ ని చెప్పుతో కొడతానన్న డైరెక్టర్ బాలచందర్ కారణం..??
అయితే అదే టైమ్ కు బాల చందర్ గారి నుంచి పిలుపు వచ్చిందట. ఇంకో సీన్ తీసేందుందని అసిస్టెంట్ తో రజనీ కు కబురందించాడట. అయితే అప్పటికే రజనీ ఫుల్లుగా తాగేశాడు. ఇప్పుడు తను తాగిన విషయం తెలిస్తే బాల చందర్ గారు కోప్పడతారని.. వెంటనే బ్రష్ చేసుకుని, స్నానం చేసి షూటింగ్ స్పాట్ కు వెళ్లాడట. అయితే బాల చందర్, రజనీ మందు తాగిన విషయం కనిపెట్టి.. తిట్టాడట. నాగేష్ అనే గొప్ప యాక్టర్ గురించి చెబుతూ.. ఆయన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. తాగడం వల్ల ఆయన కెరీర్ నాశనం అయిపోయింది. ఇలా ఇంకోసారి షూటింగ్ టైమ్ లో మందు తాగితే చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చాడట. అంతే అప్పటి నుంచి రజనీ ఎంత లేటైనా సరే షూటింగ్ అయిపోయాకే ఆల్కహాల్ సేవించేవాడట. ఇక డైరెక్టర్ బాల చందర్ అంటే.. రజనీకి వల్లమాలిన ప్రేమ. నిజానికి రజనీ కి సినీ కెరీర్ ప్రసాదించిందే బాల చందర్. అలా తన రజనీకాంత్, బాల చందర్ ను గురువుగా భావిస్తాడు. అందుకే బాల చందర్ ఎన్ని మాటలన్నా రజనీ కాంత్ తన తండ్రి తిడుతున్నాడనే భావనతో ఉండేవాడట. అప్పట్లో వీళ్లని చూసి గురు, శిశ్యులంటే ఇలా ఉండాలని అనేవారట.