ముగింపు దశకు చేరుకున్న ఎన్టీఆర్ దేవర.. షూటింగ్ నుండి లేటెస్ట్ అప్డేట్..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భార్య అంచనాలు నెలకొన్నాయి.  కాగా ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ  జాన్వి కపూర్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అవ్వబోతోంది. అందుకే ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక యంగ్ మ్యూజిక్

 సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని డైరెక్టర్ రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశాడు కొరటాల శివ. అయితే మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నామని ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సైతం విడుదల చేశారు..”ఫియర్ సాంగ్” గా వచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.యూట్యూబ్ లో రికార్డు

 వ్యూస్ తో దూసుకుపోతుంది .ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్  దేవర సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.గోవా లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది.అక్కడ కొంత టాకీ పార్ట్ తో పాటు, ఒక సాంగ్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందా లేక మరో షెడ్యూల్ వుంటుందా అనేది తెలియాల్సి వుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి సెకండ్ సాంగ్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. అలా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: