"ఆర్ఆర్ఆర్" హీరోల షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోలుగా నటించారు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం , ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో వీరిద్దరికి కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభించింది . ఇక పోతే ప్రస్తుతం వీరిద్దరూ కూడా తమ తమ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు . అందుకు సంబంధించిన సినిమా షూటింగ్స్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే వివరాలను తెలుసు కుందాం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కియర అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామ్ చరణ్ మరియు మరి కొంత మంది ఇతరులపై రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాజమండ్రి షెడ్యూల్ తో ఈ మూవీ మొత్తం షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృంద భారీ ప్రస్తుతం గోవా లో ఎన్టీఆర్ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా  సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: