ఆయన కోసమే ఉప్పెన లో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ చేశా.. విజయ్ సేతుపతి..!

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో సైతం అంతే సమానంగా గుర్తింపును సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి భారీగా గుర్తింపు పొందాడు. తన అద్భుతమైన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం దక్కించుకున్నాడు. అలాగే వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి కాంబినేషన్లో వచ్చిన ఉప్పెన సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో కృతి శెట్టి తండ్రి పాత్రలో కనిపించాడు విజయ్ సేతుపతి. ఇందులో తండ్రి పాత్రలో తన అద్భుతమైన

 నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహారాజా అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు విజయ సేతుపతి. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సైతం పూర్తయింది. కాగా క్రైమ్ సస్పెన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా 14వ తేదీన గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. నితిలన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీజర్ ట్రైలర్ విడుదల చేయగా అవి సైతం సోషల్ మీడియాలో భారీ

 రెస్పాన్స్ ను కనబరిచాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా  ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి. ఇందులో భాగంగానే హైదరాబాదులో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ సేతుపతి ఉప్పెన సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఉప్పెన లో తండ్రి పాత్రలో నటించడానికి అసలు కారణాన్ని బయటపెట్టాడు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఉప్పెన కేవలం బుచ్చిబాబు కోసమే చేశానని చెప్పుకొచ్చిన విజయ్‌, పై బుచ్చి బాబుకు ఉన్న ప్యాషన్‌ చూసి ఒప్పుకున్నాను అన్నారు. హీరోయిన్‌కి తండ్రి పాత్రలో నటించడానికి మామూలుగా అయితే తనలాంటి యాక్టర్స్‌ వెనకడుగు వేస్తారని, కానీ బుబ్చిబాబు కోసం తక్కువ రెమ్యునరేషన్‌ తీసుకొని మరీ లో నటించానని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: