మోదీ గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తున్న బాబు, నితీష్‌?

ఎన్డీయే కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ చాలా గొప్పగా సెలవిచ్చారు. ఇది అటల్ బిహార్ వాజ్ పేయీ, జార్జి ఫెర్నాండేజ్, ప్రకాశ్ సింగ్ బాదల్ వంటి గొప్ప గొప్ప నాయకులు ఈ కూటమిని నిర్మించారు అంటూ సెలవిచ్చారు. అందువల్ల ఈ కూటమి ఐక్యంగా ఉంటుంది. ఎన్డీయేకి దేశ ప్రయోజనాలే తప్ప వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు ఉండవు అంటూ మాట్లాడారు.
   
ఒక ఆర్గానిక్ కూటమిగా అభివర్ణించారు. అంటే సహజ మిత్రుల  అలయన్స్ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ మాటలు విన్న భాజపా పక్షాలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా  కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆ కూటమిలో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తుంది  చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ లు. ఇందులో ముఖ్యంగా నితీశ్ కుమార్ ఎన్నిసార్లు బయటకు వచ్చారో.. ఎన్నిసార్లు ఎన్డీయేలోకి ఎంట్రీ ఇచ్చారో ఆయనకు కూడా తెలియదు. అవకాశ వాద రాజకీయాలకు పెట్టింది పేరు. రాజకీయ స్థిరత్వం లేని నాయకుడు. పైగా ప్రస్తుతం ఇండియా కూటమి నాయకులు సైతం ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఆయన దేశం కోసం బీజేపీ తో కలిసి పనిచేస్తారని సగటు ఏ పార్టీ కార్యకర్త భావించరు. బిహార్ సీఎం పదవిని చేపట్టేందుకు ఆయన ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇక చంద్రబాబు విషయానికొస్తే.. 2018లో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీపై ధర్మ పోరాట దీక్షలు చేసిన విషయం ఇంకా ఎవరూ మరిచిపోలేదు.

పైగా మోదీని, అమిత్ షాను విమర్శించిన తీరు అందరికీ గుర్తే ఉంది. 2019లో బీజేపీ ఓడిపోతుంది అని భావించే చంద్రబాబు బయటకు వచ్చారు. భవిష్యత్తులో ఆ పార్టీ ఆదరణ కోల్పోతుందని భావిస్తే చంద్రబాబు బయటకు రాడనే గ్యారంటీ లేదు. 2014లో కలిసి, 2019లో విడిపోయి మళ్లీ 2024లో కలిసి ఎన్నికలకు వెళ్లారు. అలాగే జేడీఎస్ కూమార స్వామి. ఇక చిరాగ్ పాశ్వాన్  బిహార్ లో నితీశ్ ను దెబ్బతీసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల ప్రధాని మోదీ దీనిని ఆర్గానిక్ కూటమిగా, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీలగా తన స్వార్థం కోసం ఆకాశానికెత్తడం పలువురికి ఆశ్చర్యానికి గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: