చంద్రబాబును ఓడించిన ఆ తప్పే.. జగన్‌ కూడా చేశారా?

ఈసారి ఏపీలో పోటా పోటీ ఎన్నికలు జరుగుతాయి అనేది సుస్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఈ ఎన్నికలు ఆయా పార్టీకలు జీవన్మరణ సమస్య లాంటివి. గెలిచిన పార్టీది అధికారంతో పాటు రాజకీయ జీవం కూడా అని విశ్లేషకులు అంటున్నారు. ఓడిన పార్టీకి ముప్పు పొంచి ఉంది అని పేర్కొంటున్నారు. అదేంటి అంటే రాజకీయ తెర మీద నుంచి కనుమరుగు కావడం అని విశ్లేషిస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉండేది. ఇప్పటికీ ఆ పార్టీ మనుగడలో ఉందంటే దానికి కారణం ఇదే. ఇదే సందర్భంలో అనూహ్యంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూడా అదే స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వచ్చింది. అందుకే అధికారం కోల్పోయినా.. పట్టు సడలకుండా పోరాడుతూ అధికారాన్ని చేపడుతూ వస్తోంది. ఇవి ఒకప్పటి రాజకీయం.

కానీ ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే నాయకులు ఉంటున్నారు. ప్రతిపక్షంలో కూర్చునేందుకు అసలు ఇష్టపడటం లేదు. పక్కరాష్ట్రమైన తెలంగాణను చూసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ కు ఎదురేలేదు. అనుకున్నారు. కానీ ఒక్క ఓటమి దెబ్బతో ఆపార్టీ కుదేలైంది. కనీసం ఎంపీగా పోటీచేసేందుకు సైతం అభ్యర్థులు ముందుకు రావడం లేదు. అంత దయనీయంగా మారింది.

ఇక వైసీపీ విషయానికొస్తే కాంగ్రెస్ నేతలంతా వైసీపీలో చేరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించకుండా.. పాలనపై దృష్టి కేంద్రీకరించారు. దీంతో పార్టీ బలహీనంగా తయారైందని చంద్రబాబు నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే ఆ స్థానాన్ని జనసేన ఆక్రమిస్తుందని చెప్పి పవన్ ను పొత్తుకు ఒప్పించారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలి. కమిటీలు తదితర విషయాలను నేను చూసుకుంటాను అని చెప్పినట్లు సమాచారం. ఇది నమ్మిన పవన్ 20 సీట్లకు ఒప్పుకున్నారు. ఒకవేళ వైసీపీ ఓడిపోతే వందరోజుల్లో పార్టీ పేకమేడలా కుప్పకూలిపోతుందని సీఎం రమేశ్ లాంటి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే చంద్రబాబు అంత నమ్మకంగా పనిచేస్తున్నారు అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: