ఒకే మ్యాచ్ లో.. మామ, అల్లుళ్లు.. ఇంతకీ ఏ జట్టు తరఫున అంటే?

praveen
రాజకీయాల్లో సినిమాల్లో లాగానే క్రికెట్లో కూడా ఎంతో మంది స్టార్ ప్లేయర్ల వారసులు మళ్లీ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఎంట్రీ ఇచ్చిన వారు భారీ అంచనాల మధ్య జట్టులోకి అరంగేట్రం చేసి తమను తాము నిరూపించుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఏకంగా తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును సంపాదించుకోలేక చివరికి ఇక క్రికెట్లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక.. కనుమరుగు అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఎవరైనా సీనియర్ క్రికెటర్ కు సంబంధించిన వారసుడు క్రికెట్ లోకి ఎంటర్ ఇస్తున్నాడు అంటే అది సీనియర్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతూ ఉంటుంది. కానీ ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు.. అది కూడా మామ అల్లుళ్లు ఓకే మ్యాచ్లో ఆడటం మాత్రం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అయితే ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఇదే జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా ఏకంగా మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా ఒకే జట్టు తరఫున సహచరులుగా ఆడారు. ఇది కాస్త వైరల్ గా మారింది. కాస్త ఆలస్యంగా జట్టులోకి అరంగేట్రం చేసిన మామ నూర్ అలీ జాద్రాన్ అప్పటికే తన ప్రతిభతో తొందరగా జట్టులో చోటు సంపాదించుకున్న యువ ఆటగాడు ఇబ్రహీం జాద్రాన్ ఏకంగా క్యాప్ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించాడు.

 ఇలా మామ అల్లుళ్లు ఇద్దరు కూడా ఒకే మ్యాచ్లో ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ జట్టుకు విజయాన్ని అందించేందుకు పోరాడుతూ ఉండడం మాత్రం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు మరోసారి మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా కలిసి ఒకే మ్యాచ్ ఆడబోతున్నారు. ఐర్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రస్తుతం ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఆఫ్గనిస్తాన్ జట్టు తరఫున నూర్ అలీ జాద్రాన్, ఇబ్రహీం కలిసి ఇన్నింగ్స్ ను ఆరంభించారు అని చెప్పాలి. ఇక ఇద్దరు మామ అల్లుళ్లు కూడా ఒకే జట్టు తరఫున ఇన్నింగ్స్ ని ఆరంభించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా ఈ విషయం తెలిసి వీళ్ళు అదృష్టవంతులు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: