పాపం.. అదృష్టం తలుపుతట్టేలోపే.. దురదృష్టం వెక్కిరించింది?

praveen
ఈ మధ్య కాలంలో టీమిండియాలో ఎంతోమంది యువ ఆటగాళ్లు వరుసగా ఛాన్సులు దక్కించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా వచ్చిన ఛాన్సులను సద్వినియోగం చేసుకుంటూ తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. అయితే ఇటీవలే జట్టులో స్టార్ బౌలర్గా ఉన్న బమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో  టీంలో ఛాన్స్ దక్కించుకున్నాడు యువ ఆటగాడు ఆకాష్ దిప్. అయితే ఇతగాడికి గతంలో పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డులు ఏమీ లేవు. ఐపీఎల్ లో కూడా గొప్ప రికార్డులు ఏమి సాధించలేదు.

 అయినప్పటికీ అనూహ్యంగా అతనికి భారత జట్టు తరఫున ఆడే అవకాశం వచ్చింది. రాంచి వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో అతను బౌలర్గా అరంగేట్రం చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఒకరకంగా సిరాజ్, ఆకాష్ దీప్ లపై ఇంగ్లాండు బ్యాట్స్మెన్లు విరుచుకుపడ్డారు అని చెప్పాలి. అయితే ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో ఏకంగా మొదటి ఓవర్ లోనే ఒక అద్భుతమైన బంతివేసి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జాక్ క్రాలిని క్లీన్ బౌల్డ్ చేశాడు ఆకాష్ దీప్. ఈ క్రమంలోనే తనకు టీమిండియా తరఫున మొదటి వికెట్ దక్కడంతో ఇక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్. ఎగిరి గంతేసాడు. కానీ ఆ ఆనందం అతనికి ఎంతో సేపు లేదు.

 ఏకంగా సెకండ్ల వ్యవధిలోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. ఎందుకంటే అతను వికెట్ తీసిన బంతిని ఎంపైర్ నో బాల్ అని ప్రకటించాడు. దీంతో ఆకాష్ దీప్ షాక్ లో మునిగిపోగా.. అటు జాక్ క్రాలి బతికిపోయాడు. అది నోబాల్ కాకపోయి ఉంటే అతనికి మొదటి వికెట్ దక్కేది. అది కూడా అద్భుతమైన ఇన్ స్వింగర్ బంతికి వికెట్ దక్కితే అతనిపై ప్రశంసలు కూడా వచ్చేవి. కానీ తొలి ఓవర్ లోని వికెట్ తీసిన బౌలర్గా రికార్డు సృష్టించే వాడు. అదృష్టం వచ్చి తలుపుతట్టిలోపే అతని దురదృష్టం తలదన్నేసింది అంటూ ఇక ఈ ఘటనపై ఎంతోమంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: