దేవుడికి పెట్టిన దీపం.. చివరికి ఎంత పని చేసింది?

praveen
సాధారణంగా మనుషులు చేసే చిన్న చిన్న పొరపాట్లే కొన్ని కొన్ని సార్లు పెద్దపెద్ద ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక భారీ ప్రాణనష్టాన్ని ఆస్తి నష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రతి విషయంలో కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలని ఎప్పుడూ సూచిస్తూ ఉంటారు అధికారులు. ఇక ఇప్పుడు జరిగిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే. సాధారణంగా ఏదైనా గుడికి వెళుతున్నప్పుడు ఇంట్లో ఉన్న పూజ గదిలో  పూజ చేసి దీపం వెలిగించడం లాంటివి చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇలా దీపం వెలిగించి ఇంట్లో మొక్కుకున్న తర్వాతే మళ్ళీ గుడికి బయలుదేరడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇక్కడ ఇలా దేవుడిని మొక్కి దీపం వెలిగించడమే  ఒక పెద్ద ప్రమాదానికి కారణమైంది అని చెప్పాలి.  కరీంనగర్ పట్టణంలోని ఆదర్శనగర్ ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఇంట్లో వెలిగించిన దీపం కారణంగా 10 సిలిండర్లు పేలిపోగా ఏకంగా 20 గుడిసెలు కాలి బూడిద అయ్యాయి. ప్రస్తుతం ములుగు జిల్లాలో జరుగుతున్న వనదేవతల జాతర అయిన మేడారంకు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజనులందరూ కూడా భారీగా తరలివస్తుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఓ కుటుంబం మేడారం జాతరకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే వెళ్లే ముందు ఇంట్లో దీపం వెలిగించి దేవుడికి మొక్కుకున్నారు. అయితే ఆ దీపాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మంటలు చెలరేగడంతో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇక ఈ మంటలు వ్యాప్తి మిగతా ఇళ్లకు కూడా పాకి పోవడంతో మొత్తంగా 10 సిలిండర్లు పేలిపోగా.. ఇక ఆ ప్రాంతంలో ఉన్న 20 గుడిసెలు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. ఇక మంటల్లో డబ్బు నగలు మొత్తం కాలి బూడిదయ్యాయి. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం మాత్రం జరగలేదు.

 అయితే ఇలా భారీగా ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో బాధితుల బాధ వర్ణనాతీతంగా ఉంది అని చెప్పాలి. తమకు న్యాయం చేయాలి అంటూ కోరుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: