బెస్ట్ ఫ్రెండ్ నే చంపేశాడు.. ఎందుకో తెలుసా?

praveen
సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల బంధాలు ఉన్నప్పటికీ స్నేహబంధం మాత్రం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇక ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా కూడా స్నేహబంధం చివరి వరకు తోడుగానే ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అంటూ భరోసా ఇస్తుంది. సుఖం వచ్చినప్పుడు ఆనందాన్ని పంచుకుంటుంది. ఇలా ప్రతి విషయంలోనూ స్నేహబంధం తోడుగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల దగ్గర చెప్పుకోలేని బాధలు సైతం స్నేహితుల దగ్గర చెప్పుకునేంత  స్వేచ్ఛ కూడా దొరుకుతూ ఉంటుంది. అందుకే స్నేహబంధాన్ని మించింది మరొకటి లేదు అని అంటూ ఉంటారు.

 అయితే ఇలా స్నేహితుడికి కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అంటూ వెన్ను తట్టి.. ఆపదలో ఆదుకోవాల్సిన స్నేహితుడు ఇక్కడ ఏకంగా యమకింకరుడుగా మారిపోయాడు. ఏకంగా బెస్ట్ ఫ్రెండ్ ప్రాణాన్నే తీయడానికి కూడా వెనకడుగు వేయలేదు. మద్యం మత్తులో  చివరికి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది అని చెప్పాలి. హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఇద్దరూ కలిసి ఎప్పటిలాగానే మద్యం సేవించారు. కానీ వీరిద్దరి మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. ఇక మాటా మాటా పెరిగిపోవడంతో చివరికి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.

 జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ లో ఈనెల 9వ తేదీన యాసీన్ బేగ్ అనే 45 ఏళ్ల వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ మర్డర్ మిస్టరీ చేదించారు. అయితే యాసిన్ బేగ్ ను హత్య చేసింది ఎవరో కాదు ఏకంగా అతని బెస్ట్ ఫ్రెండ్ అయినా ఫేకు ఖాన్ అనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతని ఇటీవల అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మద్యం తాగిన సమయంలో ఇద్దరి మధ్య ఏదో విషయంలో వాగ్వాదం తలెత్తడంతో ఇక దారుణంగా హత్య చేశాడట ఫేకు ఖాన్. డ్రమ్ములు కోసే కత్తితో మెడపై పలుమార్లు దాడి చేయడంతో చివరికి యాసిన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు పోలీసులు విచారణలో నిజం బయటపడింది. అయితే ఈ హత్యకు ఫేకు ఖాన్ కు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: