ప్రతి ఒక్కరూ అలా చేయాల్సిందే.. ఇండియన్ క్రికెటర్స్ కి.. జై షా స్ట్రాంగ్ వార్నింగ్?

praveen
ఇటీవల కాలంలో భారత జట్టులో యువ ఆటగాళ్ల హవా పెరిగిపోయింది. ఎంతో మంది యంగ్ ప్లేయర్లు టీమిడియాలో వరుసగా చాన్సులు దక్కించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు దేశవాలి క్రికెట్ క్రికెట్లో ఆట తీరు ఆధారంగానే భారత జట్టులోకి సెలెక్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు బీసీసీఐ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపిఎల్ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా ఎంతోమంది ప్లేయర్లకు ఇక భారత జట్టులో ఛాన్సులు దక్కుతున్నాయి అన్న విషయం తెలిసిందే.

 దీంతో దేశవాళి క్రికెట్లో బాగా రాణిస్తున్నప్పటికీ ఐపీఎల్లో ఛాన్సులు దక్కించుకోలేకపోతున్న కొంతమంది ఆటగాళ్లను అటు భారత సెలక్టర్లు కనీసం జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోవడం లేదు అనే విషయంపై విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఎంతో మంది ఆటగాళ్లు కూడా ఇలాంటి ఆలోచన ధోరణితోనే వ్యవహరిస్తూ ఉన్నారు. దేశవాళి క్రికెట్ ను అస్సలు పట్టించుకోవట్లేదు. కుదిరితే ఐపీఎల్లో ఆడాలని.. ఐపిఎల్ లో బాగా రాణించి మళ్లీ జాతీయ జట్టులోకి రావాలని అనుకుంటున్నారు. ఇక ఇషాన్ కిషన్ కూడా మొన్నటి వరకు ఇలాంటి ఆలోచన తీరుతూ ఉంటే.. దేశవాళి క్రికెట్లో ఆడితేనే మళ్ళీ జాతీయ జట్టులో స్థానం కల్పిస్తామంటూ బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో అతను దేశవాలి క్రికెట్ ఆడెందుకు సిద్ధమయ్యాడు.

 అయితే ఇదే విషయంపై భారత క్రికెట్ ఆటగాళ్లు అందరికీ కూడా బీసీసీఐ సెక్రెటరీ జై షా ఇటీవల ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. భారత ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ హెచ్చరించాడు జై షా. ఈ మేరకు ఒక లేఖను విడుదల చేశాడు. జట్టు సెలక్షన్ కు దేశవాలి క్రికెట్ నే ప్రామాణికంగా పరిగణిస్తాం అంటూ స్పష్టం చేశాడు. ఇటీవలే కాలంలో దేశవాళి క్రికెట్ కి బదులు ఐపీఎల్ ను కొంతమంది ప్రాధాన్యంగా పరిగణించడం  ఆందోళనకరం  అలాంటి వారిపై తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి. భారత జట్టుకు ఆడాలనుకునే ప్రతి ప్లేయర్ కూడా తప్పకుండా దేశవాలి క్రికెట్ ఆడాల్సిందే అంటూ జై షా స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: