ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో టైటిల్.. నిజంగా ఇది ఛాంపియన్ ఫ్రాంచైజీనే?

praveen
ఐపీఎల్ లో ఛాంపియన్ టీం గా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్ జట్టు  ఏకంగా ఒక చెన్నై సూపర్ కింగ్స్ మినహా ఇతర ఏ టీంకి సాధ్యం కాని రీతిలో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో తిరుగులేని జట్టుగా అవతరించింది అన్న విషయం తెలిసిందే. అయితే తర్వాత కాలంలో ముంబై ఇండియన్స్ అంటే కేవలం ఒక ఫ్రాంచైజీ మాత్రమే కాదు అది ఒక బ్రాండ్ అన్న విధంగా ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది. అయితే కేవలం ఐపిఎల్ ను మాత్రమే కాకుండా ముంబై ఇండియన్స్ ఇతర దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్న టి20 లీగ్లలో కూడా పలు జట్లను  కొనుగోలు చేసింది. అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఒక జట్టును కొనుగోలు చేసింది ఈ ఫ్రాంచైజీ.

 అయితే ముంబై ఇండియన్స్ అనేది ఒక బ్రాండ్ అన్న విధంగా ప్రస్థానం కొనసాగుతుంది. ఎందుకంటే కేవలం ఐపిఎల్ లో మాత్రమే కాదు ఇతర టి20 లీగ్లలో కూడా ముంబై ఇండియన్స్ వరుసగా టైటిల్స్ గెలుస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే బీసీసీఐ నిర్వహించే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మొదటి సీజన్లోనే టైటిల్ విజేతగా నిలిచింది ముంబై ఇండియన్స్. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఖాతాలో మరో ఒక టైటిల్ వచ్చి చేరిపోయింది. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇటీవల ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు విజయం సాధించింది. దుబాయ్ క్యాపిటల్స్ జట్టును ఫైనల్ లో ఓడించి ఇలా టైటిల్ విజేతగా నిలిచింది ఎంఐ ఎమిరేట్స్.

 దుబాయ్ ప్రీమియర్ వరల్డ్ ఇంటర్నేషనల్ లీగ్ టి20-2024లో భాగంగా ఇటీవల ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే దుబాయ్ క్యాపిటల్ తో జరిగిన మ్యాచ్లో 45 పరుగుల తేడాతో విజయం సాధించింది ఎంఐ ఎమిరేట్స్ జట్టు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై 208/3 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ క్యాపిటల్స్ జట్టు 263/7 పరుగులు మాత్రమే 20 ఓవర్లలో చేయగలిగింది. దీంతో 45 పరుగుల తేడాతో ముంబై జట్టుకు విజయం వరించింది. కాగా ఈ మ్యాచ్ లో ముంబై ఆటగాళ్లు  పూరన్ 57, ఫ్లెక్చర్ 53 పరుగులతో రాణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: