టీమిండియా తొండాట.. ఇదే ప్రూఫ్ అంటున్న ఇంగ్లాండ్ మాజీలు?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు ముగియగా.  ఇక ఇప్పుడు రాజ్కోట్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుంది. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది కూడా ముందుగా ఊహించడం కష్టంగా మారిపోయింది. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఏకంగా 425 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ క్రమంలోనే భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఎక్కడ తడబాటుకు గురికాకుండా.. ఇక భారీగా పరుగులు చేస్తూ ఉండడం గమనార్హం.

 అయితే ఇలా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో.. ఇక ఇటీవలే ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న ఓలి పోప్ ఔట్ అయిన విధానం మాత్రం వివాదాస్పదంగా మారిపోయింది అని చెప్పాలి. ఇదే విషయం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే టెక్నాలజీ తప్పిదం కారణంగానే తమ బ్యాటర్ ఓలి పోప్ అవుట్ అయ్యాడు అంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు స్టువర్ట్ బ్రాడ్, మైకల్ వన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే డిఆర్ఎస్ నిర్ణయాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తి  వ్యక్తపరిచారు అని చెప్పాలి.

 ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ వేసిన 31 ఓవర్లో ఓలి పోప్ ఎల్ బి డబ్ల్యూ గా వెనదిరిగాడు. అయితే ఈ ఓవర్ చివరి బంతిని సిరాజ్ ఇన్ సింగర్ గా వేయగా.. ఓలి పోప్ బీట్ అయ్యాడు. బ్యాట్ ను మిస్ అయిన బంతి ప్యాడ్లను తాకడంతో భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. అయితే అవుట్ సైడ్ లెగ్ స్టంప్ వెళుతుందని అతను భావించాడు. కానీ ఇక భారత ఆటగాళ్లు రివ్యూ తీసుకున్నారు. రివ్యూలు బంతి లేక్లెగ్ స్టంపును తాకుతున్నట్టు కనిపించింది. దాంతో ఎంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని అవుట్ ఇచ్చాడు. అయితే ఓలి పోప్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఓలి పోప్ ప్యాడ్ లను బంతి హైట్ లో తాకితే.. బాల్ ట్రాకింగ్ లో మాత్రం వికెట్ లను తాకుతున్నట్లుగా చూపించారు. దీంతో భారత్ తొండాట ఆడుతుంది అన్నట్లుగా కామెంట్లు చేశారు ఇంగ్లాండు మాజీలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: