ఈ ఐపీఎల్లో.. సన్రైజర్స్ కెప్టెన్ అతనే : గవాస్కర్

praveen
మరికొన్ని రోజుల్లో ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడి మొదలు కాబోతుంది. మార్చి నెలలో ఇక ఈ రిచెస్ట్ క్రికెట్ లీగ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టోర్నీలో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఇప్పటికే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇలాంటి రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే ఐపీఎల్లో ఉన్న పది జట్లలో కొన్ని టీమ్స్ కొత్త కెప్టెన్లతో 2024 ఐపీఎల్ సీజన్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా మరోసారి కెప్టెన్ ను మార్చే అవకాశం ఉంది అని ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 గతంలో డేవిడ్ వార్నర్ తర్వాత కాలంలో కేన్ విలియమ్సన్ ఇక గత సీజన్లో మార్కరమ్ ఇలా వరుసగా కెప్టెన్లను మార్చుతూ వస్తుంది సన్రైజర్స్ జట్టు యాజమాన్యం. అయితే ఎంతోమంది సారధులను మార్చిన ఆ జట్టుకు మాత్రం ఎందుకొ అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. అయితే ఇక 2024 ఐపీఎల్ సీజన్లో మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కెప్టెన్సీ మార్పు ఉండడం ఖాయం అన్నది తెలుస్తుంది. ఎందుకంటే గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న ఫ్యాట్ కమిన్స్ ను 20.5 కోట్లు పెట్టి మరి భారీ ధరకు కొనుగోలు చేసింది సన్రైజర్స్. దీంతో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన కెప్టెన్ గా కొనసాగుతున్న ఫ్యాట్ కమిన్స్ సారాధ్య బాధ్యతలు అప్పగించి అవకాశం ఉంది అని అందరూ అంచనా వేస్తూ ఉన్నారు.

 అయితే ఇదే విషయంపై భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ సైతం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ కెప్టెన్గా ప్యాడ్ కమిన్స్ ను ఆ జట్టు యాజమాన్యం కచ్చితంగా నియమిస్తుంది అంటూ సునీల్ గవాస్కర్ తెలిపాడు. మినీ వేలంలో 20.5 కోట్లకు అతని సన్రైజర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కమిన్స్ ఫై పెట్టిన ధర కాస్త ఎక్కువ అయినప్పటికీ నాయకత్వ లక్షణాలను పరిగణలోకి తీసుకుంటే ఇక సన్రైజర్స్ మంచి ఆలోచన చేసింది. గత ఏడాది చెత్త నిర్ణయాలతో జట్టు చివరికి మూల్యం చెల్లించుకుంది అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: