ఆ వార్తలు నిజం కాదు.. నేను ఎక్కడికి వెళ్లట్లేదు : సర్ఫరాజ్ అహ్మద్

praveen
భారత పొరుగు దేశమైన పాకిస్తాన్లో అటు ఆర్థికపరమైన సంక్షోభం  మాత్రమే కాదు క్రికెట్లో కూడా ఇటీవల కాలంలో తీవ్రమైన సంక్షోభం నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఇక ఆ దేశ క్రికెట్లో అనూహ్యమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక మొన్నటికీ మొన్న వరల్డ్ కప్ ముగిసిన వెంటనే మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా కొనసాగిన బాబర్ అజాం ను సారాధ్య బాధ్యతలు నుంచి తప్పించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఆ తర్వాత యువ ఆటగాళ్లకు ఒక్కో ఫార్మాట్ కి వేరువేరుగా సారధ్య బాధ్యతలను అప్పగించింది.

 అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు ఆట తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఏకంగా సొంత గడ్డపై జరిగిన మ్యాచ్లలో కూడా ఘోర ఓటములు చవిచూస్తూ ఉండడంతో పాకిస్తాన్ జట్టును విమర్శించే వాళ్ళు రోజురోజుకు ఎక్కువైపోయారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కూడా ఇక నావల్ల కాదు బాబోయ్ అంటూ ఏకంగా తన పదవికి రాజీనామా చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో పాక్ క్రికెట్లో సీనియర్ ప్లేయర్గా కొనసాగుతూ గత కొంతకాలం నుంచి జట్టులో అవకాశం రాక నిరాశలో ఉన్న క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ ఏకంగా దేశం విడిచిపెట్టి లండన్ కు వెళ్ళిపోతున్నాడని.. అక్కడ కౌంటి క్రికెట్ ఆడబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయంపై సర్ఫరాజ్ అహ్మద్ ఖండించాడు. నేను లండన్కు వలస వెళ్లినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. పాకిస్థాన్ విడిచి పెట్టాలని ఆలోచన లేదు  ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకరం అంటూ సర్ఫరాజ్ అహ్మద్ కామెంట్ చేశాడు.

 అయితే పాకిస్తాన్ జట్టులో సర్ఫరాజ్ అహ్మద్ కు స్థానం దక్కించుకోవడంపై అనిష్చితి నెలకొన్న నేపథ్యంలో అతను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే గత కొంతకాలం నుంచి ఈ సీనియర్ క్రికెటర్ ను సెలెక్టర్లు ఎక్కడ పట్టించుకోవట్లేదు. యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ ఉండడంతో సరఫరాజ్ అహ్మద్ కు ప్రతిసారి కూడా నిరాశ ఎదురవుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక అతను పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఏళ్లు గడిచిపోతున్నాయి అని  చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: