సూపర్.. ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా?

praveen
ప్రస్తుతం వరుసగా ద్వైపాక్షక సిరీస్ లు  ఆడుతూ బిజీబిజీగా ఉంది టీమిండియా. ఈ క్రమంలోనే ఒకవైపు విదేశీ పర్యటనలకు వెళ్తు.. ఇంకోవైపు భారత పర్యటనకు వస్తున్న విదేశీ జట్లతో సిరీస్ లు ఆడుతుంది. ఈ క్రమంలోనే మొన్నటికీ మొన్న సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న టీమిండియా.. ఇక ఇప్పుడు భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ కూడా ముగించుకుంది. అయితే ఈ టి20 సిరీస్ లో సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు చాలా నెలల తర్వాత మళ్లీ పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టారు.

 అయితే ఇక ఆఫ్గనిస్తాన్ తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ కి ముందు భారత జట్టును ఒక ప్రపంచ రికార్డు ఊరించింది. ఇప్పటివరకు అంతర్జాతీయ టి20లలో ఎక్కువ సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా కొనసాగుతూ ఉంది టీమిండియా. అయితే ఇక ఘనతను అటు భారత దాయాది దేశమైన పాకిస్తాన్ తో పంచుకుంటుంది అన్న విషయం తెలిసిందే. కాగా పాకిస్తాన్, భారత్ జట్లు ఇక ఎనిమిదేసి సార్లు టి20 సిరీస్ లలో ప్రత్యర్థులను క్లీన్ స్వీప్ చేసి అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన టీమ్స్ గా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న సిరీస్ లో భారత జట్టు ప్రత్యర్థిని  క్లీన్ స్వీప్ చేస్తే ఇక పాకిస్తాన్ ను వెనక్కి నెట్టి ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశం వచ్చింది.

 అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత జట్టు.. చివరికి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేసింది అని చెప్పాలి. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా వరుస విజయాలు సాధిస్తూ దూసుకొచ్చిన టీమిండియా.. 3-0 తేడాతో ఆఫ్గనిస్తాన్ ను క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పాలి. ఈ వైట్ వాష్ తో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఎక్కువసార్లు t20 ఫార్మాట్లో సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా అవతరించింది భారత్. అయితే మొదటి రెండు మ్యాచ్లలో భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం సాధించినప్పటికీ ఇక మూడో మ్యాచ్ మాత్రం ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో రెండవ సూపర్ ఓవర్లో ఫలితం భారత్ వైపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: