టీమిండియా ఈ మ్యాచ్ గెలిచిందా.. చరిత్ర సృష్టించినట్టే?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకవైపు విదేశీ పర్యటనకు వెళ్లి సిరీస్ లు ఆడుతూనే.. మరోవైపు ఇండియా పర్యటనకు వచ్చిన విదేశీ జట్లతో సిరీస్ లు ఆడుతుంది టీమ్ ఇండియా  మొన్నటికి మన సౌత్ ఆఫ్రికా పర్యటన ముగించుకున్న భారత జట్టు ఇక ఇప్పుడు ఇండియా పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే  అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్లలో సత్తా చాటుతుంది భారత జట్టు. ఏకంగా ప్రత్యర్థి  పై పూర్తి ఆదిపత్యం చెలాయిస్తుంది అని చెప్పాలి.

 అయితే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల t20 సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిశాయ్. ఈ రెండు మ్యాచ్లలో కూడా భారత జట్టు ఘనవిజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది టీమ్ ఇండియా. అయితే ఇక ఇప్పుడు మూడో మ్యాచ్ జరుగుతూ ఉండగా.. ఈ మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించి.. ఇక ఆఫ్గనిస్తాన్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయాలి అని భావిస్తుంది అని చెప్పాలి. అయితే ఒకవేళ మూడో మ్యాచ్లో టీమిండియా గెలిచింది అంటే చరిత్ర సృష్టించడం ఖాయం అన్నది తెలుస్తుంది.

 ఇలా గత కొన్ని రోజుల నుంచి వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా.. ఇక ఇప్పుడు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకవేళ నేడు జరుగుతున్న మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించి క్లీన్ స్వీప్ చేసింది అంటే t20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక క్లిన్ స్వీప్ లు చేసిన జట్టుగా భారత్ అవతరించబోతుంది. ప్రస్తుతం పాకిస్తాన్, ఇండియా జట్లు ఇక టి20 ఫార్మాట్లో ఎనిమిదేసి సార్లు సిరీస్ లను క్లీన్ స్వీప్ చేశాయి  అయితే ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియా నేడు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని భారత క్రికెట్ ప్రేక్షకులు కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: