పాక్ జట్టులో మరో విచిత్రం.. బ్యాట్ లేకుండానే రన్స్ తీసాడు.. కానీ?

praveen
అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కడా లేనన్ని శత్రువిచిత్రమైన ఘటనలు కేవలం పాకిస్తాన్ జట్టు ఆడుతున్నప్పుడు మాత్రమే ఇక ప్రేక్షకులందరికీ కూడా తారస పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగాఎంతో సులభంగా అందుకోవాల్సిన క్యాచ్ లను ఫీల్డర్లు  సమన్వయ లోపంతో వదిలివేయడం.. అంతేకాదు ఇక అత్యుత్తమ బౌలర్లు అని చెప్పుకునేవారు చిత్ర విచిత్రమైన బంతులు సంధించడం ఇక బ్యాట్స్మెన్లు విచిత్రమైన రీతిలో అవుట్ అవ్వడం.. ఇలాంటి విచిత్రాలు అన్నీ కూడా కేవలం పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎలాంటి విచిత్రమైన ఘటన జరిగిన ప్రేక్షకులు కూడా పెద్దగా ఆశ్చర్య పోరు.. ఎందుకంటే కొత్తగా చూడాల్సింది ఏముంది.. ఇప్పటివరకు పాకిస్తాన్ టీమ్ ఎన్నోసార్లు ఇలాంటి చిత్రవిచిత్రాలు ఎన్నో చేసి చూపించింది కదా అని అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అది సరేగాని ఇప్పుడు పాకిస్తాన్ జట్టు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారు కదా.. అయితే ఇక ఇప్పుడు పాకిస్తాన్ జట్టూ మరో విచిత్రం చేసి చూపించింది. సాధారణంగా వికెట్ల మధ్య పరుగుల కోసం ప్రయత్నిస్తున్న బ్యాట్స్మెన్ చేతిలో బ్యాట్ పట్టుకొని పరిగెత్తుతాడు అన్న విషయం అందరికీ తెలుసు.

 ఒకవేళ బ్యాట్ మధ్యలో జారిపోయిన మళ్లీ ఆ బ్యాట్ ని అందుకొని పరిగెత్తడం చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల జరిగిన మ్యాచ్లో మాత్రం ఏకంగా పాకిస్తాన్ ఆటగాడు బ్యాట్ లేకుండానే పరుగులు పెట్టాడు. న్యూజిలాండ్తో జరిగిన టి20 ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మహమ్మద్ రిజ్వాన్ బంతిని మిడ్ ఆఫ్ మీదుగా తరలించాడు. అయితే పరుగు తీస్తుండగా చేతుల నుంచి బ్యాట్ జారిపోయింది. అయినప్పటికీ అతను బ్యాట్ లేకుండానే పరుగును పూర్తి చేశాడు. అయితే ఎంతో కష్టపడి పరుగు పూర్తి చేశాను అనుకున్నాడు. కానీ చేతితో లైన్ ని తాకకపోవడంతో ఎంపైర్లు  షార్ట్ రన్ గా గుర్తించి అవుట్ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ జట్టుపై సెటైర్లు పేలుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: