మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు.. చివరికి ఐసీసీ ఏం శిక్ష వేసిందో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతకు అంతకు పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ కు సంబంధించిన ఏదైనా విషయం ఇంటర్నెట్ లోకి వచ్చింది అంటే చాలు అది నిమిషాల వ్యవధిలో ప్రపంచం మొత్తం పాగిపోతూ ఉంటుంది. ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తూ అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న ఎవరైనా ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడితే అది టాక్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ గా మారిపోతూ ఉంటుంది.

 సాదరణంగా దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఎవరు కూడా ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడేందుకు పెద్దగా ఇష్టపడరు. ఏకంగా దేశం తరపున ఆడటానికి గౌరవంగా భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది ప్లేయర్లు మాత్రం స్వార్థపూరితంగా ఆలోచిస్తూ చివరికి మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడటం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో ఎవరైనా క్రికెటర్ ఇలా ఫిక్సింగ్ కి పాల్పడ్డాడు అంటే చాలు ఇక ఆ విషయం వెంటనే బయటపడిపోతూ ఉంటుంది.  చివరికి ఇలా ఫిక్సింగ్ కు పాల్పడిన వారిపై ఏకంగా ఆయా దేశాల క్రికెట్ బోర్డు నిషేధం విధించడం అంటే చేస్తూ ఉన్నాయి.

 అయితే అబూదాభి t10 లీగ్ లో ఇలాగే మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు తేలింది. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ నాజిల్ హుస్సేన్ ఇలాంటి ఆలోచన చేశాడట. ఈ క్రమంలోనే అతనిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. పూనే డెవిల్స్ తరఫున ఆడుతున్న అతను 2020 - 21 సీజన్లో బుకీలతో మాట్లాడాడు. ఖరీదైన ఐఫోన్ గిఫ్ట్ గా పొందాడు. ఈ విషయాలు బయటకు రావడంతో దీనిపై సమగ్ర విచారణ జరిపింది ఐసిసి.. చివరికి నేరం రుజువు కావడంతో ఐసీసీ నేర నిరోధక విభాగం అతన్ని బ్యాన్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: