సికిందర్ రజా సంచలన రికార్డు.. కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు?

praveen
సాధారణంగా వరల్డ్ క్రికెట్లో ఒక అరుదైన రికార్డు నమోదు అయింది అంటే చాలు ఏకంగా అగ్రశ్రేణి టీం లో ఉన్న ఆటగాడే ఇక ఇలాంటి రికార్డును కొల్లగొట్టి ఉంటాడు అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కానీ కానీ ఇటీవల కాలంలో అగ్రశ్రేణి టీం లో ఉన్న ఆటగాళ్లు చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటుంటే అటు పసికూన టీం లోని ఆటగాళ్లు మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేస్తూ అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకుంటూ ఉన్నారు. ఇక ఇలా పసికూన జట్టులో ఉన్న ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాత ఎవరిని క్రికెట్లో తక్కువ అంచనా వేయొద్దు అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది.

 అయితే వరల్డ్ క్రికెట్లో చిన్న టీంగా కొనసాగుతున్న జింబాబ్వేలో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ  ఇక ప్రపంచ వ్యాప్తంగా తన ఆట తీరుతో గుర్తింపును సంపాదించుకున్న ఆటగాడు ఎవరు అంటే ఆ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న సికిందర్ రజా అని చెప్పాలి. ఏకంగా ఆల్రౌండర్ గా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపిఎల్ లాంటి టోర్నీలలో కూడా భారీ ధర పలికాడు సికిందర్ రజా. ఇక అతను ఆటతీరుతో ఎన్నో రికార్డులు సైతం కొల్లగొడుతూ వస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే మరో అరుదైన రికార్డును సాధించాడు ఈ జింబాబ్వే ఆటగాడు.

 ఏకంగా టి20 క్రికెట్లో ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. వరుసగా ఐదు మ్యాచ్లలో హాఫ్ సెంచరీలు చేశాడు సికిందర్ రజా. 58, 65, 82, 65, 62 పరుగులతో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి క్లియర్ గా ఘనత సాధించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో అర్థ సెంచరీ చేసి ఇక ఈ అరుదైన రికార్డును సృష్టించాడు ఈ జింబాబ్వే కెప్టెన్. అయితే అతని తర్వాత వరుసగా నాలుగు అర్థ సెంచరీలు చేసి మెకళ్లమ్, క్రిస్ గేల్, హెన్రిక్స్ రెండవ స్థానంలో ఉన్నారు అని చెప్పాలి. ఇలా వరల్డ్ క్రికెట్లో ఉన్న ఎంతో మంది స్టార్లకు సైతం సాధ్యం కానీ రికార్డును సికిందర్ రజా సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: