భారత క్రికెట్లో.. ఇక ఆ ఇద్దరి కెరియర్ ముగిసినట్టేనా?

praveen
భారత జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లుగా కొనసాగుతుంది ఎవరు అంటే ముందుగా ఇద్దరి పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వాళ్లే టీమ్ ఇండియా సీనియర్ ప్లేయర్లు అజింక్య రహానే, చేటేశ్వర్ పూజార. భారత టెస్టు జట్టును ఇక ఇద్దరు బ్యాట్స్మెన్లు గతంలో ఎంతో సమర్థవంతంగా బ్యాటింగ్లో ముందుకు నడిపించారు. అయితే నెమ్మది అయిన ఆట తీరుతో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక పరుగులు చేయకపోయినా పర్వాలేదు కానీ క్రీజులో పాతుకుపోతూ ప్రత్యర్థి బౌలర్లకు చిరాకు తెప్పిస్తూ ఉంటారు.. ఇక చటేశ్వర్ పూజార అయితే ఏకంగా టీమిండియా నయా వాల్ అనే ఒక బిరుదును కూడా అందుకున్నాడు అని చెప్పాలి.

 భారత జట్టు ఏదైనా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు ఇక ఇద్దరు లేని జట్టును అసలు ఊహించుకోలేకపోయేవారు అభిమానులు. కానీ గత కొంతకాలం నుంచి ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లకు భారత జట్టులో చోటే లేకుండా పోయింది అని చెప్పాలి. ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లు టెస్టుల్లోకి అరంగేట్రం చేస్తూ అదరగొడుతున్న నేపథ్యంలో.. ఇక ఈ సీనియర్ ప్లేయర్లను సెలెక్టర్లు అస్సలు పట్టించుకోవట్లేదు.

 దీంతో దేశవాళి టోర్నీలతో పాటు అటు ఇంగ్లాండ్ కౌంటిలలో ఆడుతూ ఉన్నారు ఈ ఇద్దరు. అయితే ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఇద్దరు టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ల కెరియర్ ముగిసినట్లే అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ కు ఇద్దరిని పక్కన పెట్టిన సెలెక్టర్లు.. ఇక ఈనెల 25వ తేదీ నుంచి ఇంగ్లాండుతో జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జట్టు ఎంపికలో కూడా వీరిని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మరోసారి రహానే, పూజారాలకు నిరాశ ఎదురయింది. రంజీలలో భారీగా పరుగులు చేసినప్పటికీ సెలెక్టర్లు వీరిని పట్టించుకోవట్లేదు. దీంతో ఇక కెరియర్ ముగిసిపోయినట్లే.. మళ్లీ వీరిని టీమ్ ఇండియాలో చూడటం కష్టమే అని క్రికెట్ విశ్లేషకులు కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: