కూలి: అంచనాలు పెంచుకుంటున్న రజినీ ఫ్యాన్స్?

Purushottham Vinay
జైలర్ మూవీతో తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ తన తరువాత సినిమా కూలీతో డబుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కూలీ మూవీ నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ చూస్తే రజినీ కాంత్ తో లోకేష్ కనగరాజ్ మరో సూపర్ హిట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడని అనిపిస్తుంది.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో ముడిపడే ఈ కూలీ సినిమా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే లోకేష్ సినిమా అనే విషయం పక్కన పెడితే కూలీ సినిమా మీద జైలర్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అని సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.ఒక స్టార్ హీరో సినిమా సూపర్ హిట్ పడితే ఆ సినిమాకి సంబంధించి ఇంపాక్ట్ అనేది తరువాత సినిమా మీద ఉంటుంది. జైలర్ మూవీతో నెల్సన్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించాడు. జైలర్ మూవీ రజినీకాంత్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేసింది. అయితే ఆ తర్వాత కూలీగా వస్తున్న లోకేష్ కనగరాజ్ రజినీ కాంత్ ని డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.జైలర్ మూవీతో రజినీ మేనరిజం స్టైల్ మొత్తం వాడేశాడు నెల్సన్.కాబట్టి లోకేష్ చేస్తే ఏదైనా కొత్తగా చేయాల్సి ఉంటుంది.


అయితే కూలీ సినిమా టీజర్ చూసిన ఆడియన్స్ ఇది లోకేష్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న వేటయ్యన్ ఈ దసరాకి విడుదల కాబోతుంది. ఆ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న కూలీ వస్తుంది. కూలీ సినిమా టీజర్ లో జైలర్ రిఫరెన్స్ లు బాగా కనిపిస్తున్నాయి.లోకేష్ ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం కూలీ కాదు ఇది జైలర్ 2 సినిమా అని అనుకుంటారు.ఇక కూలీ సినిమా గోల్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో భారీ యాక్షన్ సినిమాగా వస్తుందని అర్థమవుతుంది. ఇంకా అంతేకాదు రజినీ ఒకప్పటి డైలాగ్ ని మళ్లీ ఈ మూవీలో పెట్టి సర్ ప్రైజ్ చేశాడు. విక్రం లాగానే రజినీ పాత సినిమాలోని పాత్రతో దీన్ని కనెక్ట్ చేసి కూలీ సినిమాను కూడా తన యూనివర్స్ లో ఒక క్రెజీ ప్రాజెక్ట్ గా చేస్తాడా ఏంటని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఏది ఏమైనా సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రం కమల్ కు విక్రం మూవీతో ఎలాంటి హిట్ పడిందో రజినీకి కూడా కూలీతో అలాంటి బ్లాక్ బస్టర్ రావాలని భారీ అంచనాలు పెంచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: