అనసూయ పై.. దివ్వెల మాధురి హాట్ కామెంట్స్..?

Divya
ఇటీవలే నటుడు శివాజీ హీరోయిన్స్ వస్త్రధారణ పైన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెను దుమారాన్ని సృష్టించాయి. ముఖ్యంగా ఈ విషయం పైన నెటిజన్సే కాకుండా, సినీ సెలెబ్రిటీలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇలా రోజుకొకరు విమర్శలు చేస్తూ ఉండడంతో ఈ వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ విషయం పైన హీరో శివాజీ కూడా క్షమాపణలు చెప్పిన కూడా ఈ వివాదం మాత్రం చల్లారడం లేదు. తాజాగా ఈ వివాదంలోకి బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి, అనసూయ పైన పలు వ్యాఖ్యలు చేశారు.


దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ హీరోయిన్స్ వస్త్రధార పైన చేసిన వ్యాఖ్యలు.. ఆయన వాడిన పదజాలం తీవ్రదుమారాన్ని రేపాయి.ఈ విషయం పైన అటు సింగర్ చిన్మయి, అనసూయ వంటి వారు సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను , వస్త్రధరణను విమర్శించే హక్కు లేదంటు శివాజీ పై ఫైర్ అయ్యారు. ఈ వివాదం పైన టీవీ చర్చిలో పాల్గొన్న దివ్వెల మాధురి చాలా ఘాటుగానే స్పందించింది.


శివాజీ వాడిన పదాలు తప్పు కావచ్చు.. కానీ ఆయన చెప్పాలనుకున్నా ఉద్దేశం మంచిదని తెలియజేసింది. ఆయన చెప్పాలనుకున్న పాయింట్లో నిజం ఉంది అయినప్పటికీ ఆయన వాడిన పదాలు తప్పు కాబట్టి క్షమాపణలు చెప్పారు. ఇక ఆ విషయాలను వదిలేయాలి కానీ అనసూయ మాత్రం వాటిని పట్టుకొని అనవసరంగా అతిచేస్తోంది అంటూ మాధురి విమర్శించింది. స్త్రీ చీరకట్టులోనే అసలైన అందం ఉంటుందని, నేటితరం హీరోయిన్లు చాలా మితిమీరిపోయి బట్టలు వేసుకోవడం స్కిన్ షో చేస్తున్నారని తెలిపింది. హీరోయిన్స్ కూడా కేవలం డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ చెప్పినట్లుగానే బట్టలు వేసుకుంటారు. కాబట్టి ఆ మార్పు అనేది కేవలం మేకర్స్ నుంచే రావాలని సూచించారు.. ఇంతకుమించి ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడలేమంటూ తెలిపారు. మొత్తానికి కొంతమంది శివాజీ వ్యాఖ్యలను సమర్థించగా మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: