ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కి ముందు.. టీమిండియాకు బిగ్ షాక్?

praveen
భారత జట్టు గత కొంతకాలం నుంచి వరుసగా ద్వైపాక్షక సిరీస్ లు ఆడుతూ బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న సౌత్ ఆఫ్రికా పర్యటనను ముగించుకున్న భారత జట్టు.. ఇక ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఈ టి20 సిరీస్ లో అటు సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ టి20 సిరీస్ ముగిసిన వెంటనే ఈ నెల 25వ తేదీ నుంచి ఇంగ్లాండుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగబోతుంది.

 అయితే భారత జట్టు ఇలా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ ఉండగా టీమిండియాను.. గత కొన్ని రోజుల నుంచి అటు గాయాల బెడద మాత్రం తీవ్రంగా వేధిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఇలా కీలకమైన ఆటగాళ్ళు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతూ ఉండడంతో ఇక భారత జట్టు వ్యూహాలు మొత్తం తారుమారు అవుతూ ఉన్నాయి. అయితే అటు ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు మ్యాచ్ల t20 సిరీస్ టీమ్ ఇండియాకు ఎంతో కీలకంగా మారబోతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో ముందుకు వెళ్లాలి అంటే ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించడం ఎంతో ముఖ్యం.

 ఈ క్రమంలోనే ఇటీవల బీసీసీఐ ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం అటు జట్టు వివరాలను కూడా ప్రకటించింది. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ కి ముందే టీమిండియా కు ఒక భారీ షాక్ తగిలింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే భారత జట్టులో  కీలక ఫేసర్గా కొనసాగుతున్న ప్రసిద్ కృష్ణ గాయం బారిన పడ్డాడు. ప్రస్తుతం రంజీల్లో ఆడుతూ వున్నాడు ప్రసిద్. గుజరాత్ తో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో అతడు తొడ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడాడు. ఇక ప్రసిద్ కృష్ణ 14.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసి మైదానం నుంచి వెళ్లిపోయాడు. స్కానింగ్ కోసం అతడిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అతనికి కనీసం నెలన్నర విశ్రాంతి అవసరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారట. దీంతో ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు అతను దూరం కాబోతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: