నేనున్నాను.. సెలెక్టర్లకు అర్థం అయ్యేలా చేసిన సీనియర్ ప్లేయర్?

praveen
ఇటీవల కాలంలో భారత జట్టులోకి యువ ఆటగాళ్ళ రాకతో ఎంతో మంది సీనియర్ క్రికెటర్ల కెరియర్ ప్రమాదంలో పడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా కెరియర్ ప్రమాదంలో పడి భారత జట్టుకు దూరమైన ఆటగాళ్లు భారత సీనియర్ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఒకరు. ఒకప్పుడు బుమ్రాతో కలిసి భారత బౌలింగ్ దళంలో కీలక ప్లేయర్గా కొనసాగాడు భువనేశ్వర్ కుమార్. తన స్వింగ్ బౌలింగ్ తో ప్రత్యర్ధులకు చెమటలు పట్టించేవాడు.

 భారత జట్టు ఏ ఫార్మాట్లో మ్యాచ్లు ఆడిన కూడా ఇక అతను జట్టులో భాగం అయ్యేవాడు అని చెప్పాలి. ఇక తన బౌలింగ్ తో ఎన్నో అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు అని చెప్పాలి. 2014లో లార్డ్స్ మైదానంలో ఏకంగా ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ఫై భారత్ సాధించిన చిరస్మరణీయమైన విషయంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరఫున 121 వన్డేలలో 141 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్.. 87 t20 లలో 90 వికెట్లను దక్కించుకున్నాడు. టెస్టుల్లో కూడా మంచి ప్రదర్శన చేశాడు అని చెప్పాలి.

 అయితే గత కొంతకాలం నుంచి ఈ సీనియర్ ప్లేయర్కు టీమ్ ఇండియాలో చోటు దక్కడం లేదు. టీమిండియా తరఫున 2022లో చివరిగా ఒక వన్డే మ్యాచ్ ఆడాడు భువనేశ్వర్. 2018లో చివరి టేస్ట్ ఆడాడు. అప్పటినుంచి ఇక భారత జట్టులో అతనికి చోటే లేకుండా పోయింది. అయితే ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ తరఫున దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో అడుగుపెట్టిన భువి ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అదరగొట్టాడు. తాను ఇంకా ఫామ్ లోనే ఉన్నాను అన్న విషయాన్ని సెలెక్టర్లకు అర్థమయ్యేలా చేశాడు. ఉత్తర ప్రదేశ్, బెంగాల్ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్లో 13 ఓవర్లు వేసిన భువనేశ్వర్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు పరుగులు కట్టడి చేయడంలో కూడా సక్సెస్ అయ్యాడు  మరి అతను మళ్ళీ భారత జట్టులోకి వస్తాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: