కోచ్ ద్రవిడ్ చెప్పినా.. జైశ్వాల్ ను కాదని గిల్ కి చోటు.. కారణం ఏంటో తెలుసా?

praveen
ప్రస్తుతం భారత జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తో  మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఇటీవల మొహాలి వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఘనవిజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక భారత జట్టు లో ఎంతో మంది ప్రతిభవంతులైన ప్లేయర్లు అవకాశాలు దక్కించుకుంటున్నారు.

 ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా ఎవరు తుది జట్టులోకి వస్తారు ఎవరు బెంచ్ కి పరిమితం అవుతారు అనే విషయంపై కన్ఫ్యూజన్ నెలకొంటుంది అని చెప్పాలి. అయితే ఇక మొహాలీ వేదికగా జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడిగా రాబోయే మరో ఓపనర్ ఎవరు అనే విషయంపై చర్చ జరిగింది. టీమిండియాకు యశస్వి జైష్వాల్, గిల్ రూపంలో రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి అని చెప్పాలి. అయితే మ్యాచ్కు ముందు కోచ్ రాహుల్ ద్రావిడ్ రోహిత్ తో కలిసి యశస్వి జైష్వాల్ ఓపెనింగ్ చేస్తాడు అంటూ తెలిపాడు.

 కానీ తీరా మ్యాచ్ సమయానికి మాత్రం కోచ్ చెప్పిన యశస్వి జైష్వాల్ బెంచ్ కే పరిమితమైతే.. గిల్ ఇక రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేశాడు. దీంతో ఇలా ఎందుకు జరిగింది అనే విషయంపై చర్చ జరుగుతుంది. అయితే గాయం కారణంగా ఆఖరి నిమిషంలో యశస్వి జైపాల్ జట్టుకు దూరమైనట్లు బిసిసిఐ ప్రకటనలో పేర్కొంది. కుడి గజ్జలో నొప్పితో ప్రస్తుతం యశస్వి  జైష్వాల్ బాధపడుతున్నాడని.. ఆడే పరిస్థితుల్లో లేడని తెలిపింది. అందుకే ఇక భారత ఇన్నింగ్స్ ను రోహిత్, గిల్ ప్రారంభించారు అని చెప్పాలి. ఒకవేళ  జైష్వాల్ గాయం నుంచి కోలుకుంటే తర్వాతి టి20 మ్యాచ్లలో అతనికి అవకాశం దక్కి ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: