భారత జట్టులో.. ఆ ఇద్దరు ప్లేయర్లు అద్భుతం : రోహిత్ శర్మ

praveen
ప్రస్తుతం భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో టి20సిరీస్ ఆడుతూ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఇండియా వేదికగా ఆఫ్ఘనిస్తాన్, టీమ్ ఇండియా మధ్య మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవలే మొహాలీ వేదికగా జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో భారత జట్టు ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మ్యాచ్ లో అటు బౌలర్లతో పాటు బ్యాట్స్మెన్లు కూడా అదిరిపోయే ప్రదర్శన చేయడంతో ఆఫ్గనిస్తాన్ చిత్తుగా ఓడించగలిగింది టీం ఇండియా.

 ఈ క్రమంలోనే  భారత జట్టులో చోటు సంపాదించుకున్న యువ ఆటగాళ్లు అదరగొట్టేశారు. ఈ క్రమంలోనే ఇక ఇటీవల మొదటి టి20 మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించిన బ్యాట్స్మెన్లపై రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ముందుగా రన్ అవుట్ గురించి మాట్లాడుతూ.. ఆటలో ఇటువంటివన్నీ సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయితే ఎవరికైనా నిరుత్సాహం ఉంటుంది. ఇక ప్రతి ఆటగాడు కూడా జట్టులో భాగం కావాలని కోరుకుంటాడు. నేను కూడా కొన్ని పరుగులు చేయాలని అనుకున్నాను. కానీ కొన్నిసార్లు మనం అనుకున్నది జరగదు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.

 అయితే నేను అవుట్ అయినప్పటికీ కూడా గిల్ మ్యాచ్ ఫినిష్ చేయాలని అనుకున్నాను. కానీ అతను మంచి ఇన్నింగ్స్ ఆడి చివర్లో ఔట్ అయ్యాడు. అయితే జట్టులో చోటు సంపాదించుకున్న శివం దూబే, జీతేష్ శర్మలు అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఇక ఆ ఇద్దరు ప్లేయర్లు కూడా అద్భుతం అని చెప్పాలి. తిలక్ వర్మ, రింకు సింగ్ కూడా జట్టు విజయంలో  ఇక తమ వంతు పాత్ర పోషించారు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇకపోతే దాదాపు 14 నెలల గ్యాప్ తర్వాత టి20 ఫార్మాట్లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్గా వెను తిరగడంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో నిరాశలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: