వార్నీ.. ఇతను భూమ్మీద కాకుండా మరో గ్రహంలో ఉన్నాడా.. ఏమన్నాడో తెలుసా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి కొత్తగా పరిచయం చేస్తే అదే అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే అందరిలాగానే ఒక సాదాసీదా ప్లేయర్గా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అతి తక్కువ సమయంలోనే స్టార్ ప్రేయర్ గా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకులు తమ దేశ క్రికెటర్లను అభిమానించడం మానేసి ఇక విరాట్ కోహ్లీ ఆట తీరుకు ఫిదా అవుతుంటారు అని చెప్పాలి.

 అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఎంతోమంది లెజెండరీ ప్లేయర్స్ సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా బద్దలు కొట్టేశాడు. అయితే కేవలం క్రికెట్లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా తనను మించిన ఆటగాడు మరొకరు లేరు అన్న విషయాన్ని ఇప్పటికే నిరూపించాడు విరాట్ కోహ్లీ. ఇతర క్రీడల్లో రాణిస్తున్న వారు సైతం విరాట్ కోహ్లీ ఆటను ఇష్టపడుతూ ఉంటారు. ఇక కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ప్లేయర్ మాత్రం విరాట్ కోహ్లీ అంటే ఎవరో నాకు తెలియదు అంటూ చెప్పడం షాకింగ్ గా మారింది.

 అతను ఎవరో కాదు బ్రెజిల్ ఫుట్బాల్ ఆటగాడు రోనాల్డో. అతను చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయాయి. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ఆయన. ఈ క్రమంలోనే మీకు విరాట్ కోహ్లీ తెలుసా అంటూ ప్రశ్నిస్తే తెలియదు అంటూ సమాధానం చెప్పాడు రోనాల్డో. అతని సమాధానంతో యాంకర్ సైతం షాక్ లో మునిగిపోయారు. నిజంగా మీకు ఆయన తెలియదా అని మళ్లీ ప్రశ్నిస్తే ఆయన ఎవరో నాకు తెలియదు. ఎవరు అతను కూడా ఒక ఆటగాడా అంటూ ప్రశ్నించాడు రోనాల్డో. కోహ్లీ క్రికెటర్ అని చెప్పగా ఆయన ఇక్కడ పాపులర్ కాదు అంటూ రోనాల్డో చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: