విశాఖలో మ్యాచ్.. టికెట్లు ఎప్పటినుంచి విడుదల చేస్తారంటే?

praveen
ఇటీవల కాలంలో టీమ్ ఇండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో  బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. మొన్నటికి ముందు సౌత్ ఆఫ్రికా పర్యటనను ముగించుకున్న టీమిండియా ఇక ఇప్పుడు భారత పర్యటన కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో టి20 సిరీస్ ఆడుతుంది. అయితే ఈ టి20 సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్కేల్లో ముందుకు సాగాలి అంటే భారత జట్టు ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో తప్పకుండా విజయం సాధించాల్సి ఉంటుంది.

 అయితే సిరీస్ లోని మ్యాచ్లలో మొదటి రెండు మ్యాచ్లు కూడా తెలుగు రాష్ట్రాలలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువగా ఇలా టీమ్ ఇండియా మ్యాచ్ ఆడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక భారత జట్టు ఇలా తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడైనా మ్యాచ్ ఆడింది అంటే చాలు. ప్రేక్షకులు భారీగా స్టేడియం కు తరలి వెళ్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఆ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

 అయితే మొదటి మ్యాచ్ అటు హైదరాబాద్ వేదికగా జరుగుతూ ఉండగా.. రెండవ టెస్టు మ్యాచ్ విశాఖ వేదికగా జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా జరిగే మ్యాచ్ కి సంబంధించిన టికెట్ల విడుదలపై ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. ఈనెల 15వ తేదీ నుంచి కూడా టికెట్లు అమ్మకాలు ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. పేటీఎం యాప్ ద్వారా 100, 200, 300, 500 టికెట్లను ప్రతి రోజుకు విడివిడిగా ఐదు రోజులు కలిపి తీసుకునే వారికి 400, 800, 1000,  1500 రూపాయలుగా నిర్ణయించారు. అయితే వైయస్సార్, స్వర్ణ భారతి స్టేడియాలలో ఏకంగా 26 కౌంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: