ప్రత్యర్థి జట్టు కోసం పనిచేయబోతున్న దినేష్ కార్తీక్.. ఎందుకంటే?

praveen
సాదరణంగా భారత జట్టును భారత గడ్డపై ఓడించడం చాలా కష్టం. క్రికెట్ విశ్లేషకులు అందరూ కూడా ఎప్పుడు ఇదే చెబుతూ ఉంటారు. అందుకే భారత పర్యటనకు ఏదైనా జట్టు వచ్చింది అంటే ఇక టీమిండియాని ఓడించడానికి ప్రత్యేకమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎన్ని ప్లాన్స్ తో బరిలోకి దిగిన గెలుస్తాము అన్న నమ్మకాన్ని మాత్రం కాస్త తక్కువగానే పెట్టుకుంటూ ఉంటుంది ప్రత్యర్థి టీం. అంతలా భారత జట్టు సొంత గడ్డపై రాణిస్తూ ఉంటుంది. ఏ ఫార్మాట్లో అయినా ప్రత్యర్థి పై ఫైచేయి సాధిస్తూ ఉంటుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇలా ఏదైనా టీం భారత్ లో మ్యాచ్ లు ఆడుతున్నాయి అంటే చాలు ఇక భారత్కు చెందిన కొంతమంది మాజీ ఆటగాళ్ళను తమ కన్సల్టెంట్ గా నియమించుకోవడం లేదంటే భారత జట్టులో ఉన్న ప్లేయర్స్ బౌలింగ్ శైలిని కలిగి ఉన్న యువ ఆటగాళ్ళతో ఇక ప్రాక్టీస్ సెషన్ నిర్వహించుకోవడం చేస్తూ ఉంటాయి ఆయా జట్లు. అయితే ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ లయన్స్ టీం కూడా ఇలాంటిదే చేసింది అన్నది తెలుస్తుంది. భారత వెటరన్  బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ను ఇంగ్లాండు లయన్స్ బ్యాటింగ్ కన్సల్టెంట్ గా నియమించుకుంది.

 ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది అని చెప్పాలి. ఈనెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా ఇంగ్లాండ్ లయన్స్ జట్టుకు దినేష్ కార్తీక్ ఇలా బ్యాటింగ్ కన్సల్టెంట్ గా సేవలు అందించబోతున్నాడు.. అహ్మదాబాద్ వేదికగా ఇండియా ఏ జట్టుతో ఇంగ్లాండ్ లయన్స్ జట్టు  మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్లు ఆడబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇంగ్లాండ్లోని పిచ్ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఇక దినేష్ కార్తీక్ ను బ్యాటింగ్ కన్సల్టెంట్ గా నియమించుకున్నట్లు తెలుస్తుంది. కాగా భారత్ ఏ జట్టుకు అభిమాన్యూ ఈశ్వరన్ ను కెప్టెన్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk

సంబంధిత వార్తలు: