ఈసారి వరల్డ్ కప్ టీమ్ఇండియాదే.. క్రికెట్ లెజెండ్ ముందే చెప్పేసాడుగా?

praveen
2023 ఏడాదిలో ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీం ఇండియా.. ఇక అంచనాలకు తగ్గట్లుగానే ప్రతి మ్యాచ్లో కూడా విజయం సాధిస్తూ దూసుకుపోయింది. కానీ ఇక కీలకమైన ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో తడబడింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో విజయం సాధించి టైటిల్ గెలుచుకుంటే టీమిండియా కు మాత్రం నిరాశ ఎదురయింది. అయితే ఇప్పుడు 2024 టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా ముందుకు సాగుతుంది టీమిండియా.

 గత కొన్నెళ్ల నుంచి కూడా భారత జట్టుకు అందని ద్రాక్షల ఉన్న వరల్డ్ కప్ టైటిల్ను ఇక ఈ పొట్టి ఫార్మాట్లో అయిన అందుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే టి20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్లాన్లను కూడా సిద్ధం చేసుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా అటు వరల్డ్ కప్  షెడ్యూల్ ని ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ లో గెలవబోయే టీం ఏది అనే విషయంపై ఇప్పటి నుంచే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియాలో తెగ రివ్యూ ఇచ్చేస్తూ ఉన్నారు.

 ఈ క్రమంలోనే ఈ ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ జట్టులో వరల్డ్ కప్  విజేత ఎవరు అని ముందుగానే అంచనా వేస్తున్నారు. ఇదే విషయంపై సౌత్ ఆఫ్రికా క్రికెట్ లెజెండ్ ఎబి డివిలియర్స్ స్పందించాడు. ఈసారి టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియాదే అని సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబీ డీవిలియర్స్ జోష్యం చెప్పాడు. కోహ్లీ, రోహిత్ ను మళ్ళీ టి20 లోకి రప్పించడం మంచి నిర్ణయం. సీనియర్లు జట్టులో ఉండడం వల్ల జట్టుకు ఎంతగానో మేలు చేకూరుతుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా టి20 వరల్డ్ కప్ ఆడితే తప్పకుండా వరల్డ్ కప్ గెలుస్తారు. అయితే ఇక ఈ సీనియర్ల రాకతో యంగ్ ప్లేయర్లు కొన్నాళ్లపాటు ఆగాల్సిందే అంటూ ఏబి డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: