అర్జున అవార్డును.. తల్లి చేతిలో పెట్టిన షమీ.. ఫోటో వైరల్?

praveen
టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ.. ప్రస్తుతం ఎంత మంచి ఫామ్ లో కొనసాగుతూ వున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు భారత జట్టులో ఎంతోమంది యువ ఆటగాళ్లు అరంగేట్రం చేస్తూ ఉన్న సమయంలో.. సీనియర్ ప్లేయర్ల కెరియర్ ప్రమాదంలో పడిపోతుంది. ఇక అప్పటికే నిరూపించుకున్న ఆటగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తగా తమ సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా నిరూపించుకోలేక చాలామంది ప్లేయర్లు ఇక భారత జట్టులో చోటు కోల్పోయారు అని చెప్పాలి.

 కానీ అటు మహమ్మద్ షమీ మాత్రం జటులోకి ఎంతమంది కొత్త బౌలర్లు వచ్చిన తనకంటూ ప్రత్యేకమైన శైలి ఉంది అంటూ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఇక యువ ఆటగాళ్లతో పోల్చి చూస్తే అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ అదరగొడుతూనే ఉన్నాడు. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో షమీ తన స్వింగ్ బౌలింగ్ తో ఎలాంటి మ్యాజిక్ చేసి చూపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ ఇన్నింగ్స్ లోనే ఎక్కువ వికెట్లు పడగొట్టి ఇక వరల్డ్ కప్ టోర్నీలోనే టాప్ వికెట్ టేకర్ గా కూడా నిలిచాడు షమీ. అటు క్రికెట్లో చేసిన సేవలకు గాను ఇటీవలే ఒక అరుదైన గౌరవం దక్కింది.

 ఏకంగా క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమమైన అవార్డులలో ఒకటైన అర్జున అవార్డును దక్కించుకున్నాడు మహ్మద్ షమి. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక తాను అందుకున్న ఈ ప్రతిష్టాత్మకమైన ఆవార్డును మహమ్మద్ షమి తన తల్లి అంజుమ్ ఆరాకు అంకితం ఇచ్చాడు. ఈ అవార్డును ఆమె చేతిలో పెట్టాడు. దీనిని చూసిన ఆమె ఇక ఉద్వేగంతో మురిసిపోయారు అని చెప్పాలి. తన కొడుకుకు దక్కిన ఈ అరుదైన గౌరవాన్ని చూసి ఎంతగానో ఆనందపడ్డారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: