రోహిత్ కు జోడిగా అతనే ఓపెనర్.. క్లారిటీ ఇచ్చిన ద్రవిడ్?

praveen
టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ 2022 t20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని టి20 ఫార్మాట్ కు కోహ్లీతో పాటు రోహిత్ కర్మ కూడా దూరంగా ఉన్నారు అన్న విషయాన్ని బీసీసీఐ తెలిపింది. అయితే ఇక ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్  ఉన్న నేపథ్యంలో ఇద్దరు సీనియర్లు మళ్ళీ భారత జట్టులోకి వస్తారా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది అని చెప్పాలి.

 అయితే ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మళ్లీ పొట్టి ఫార్మాట్లో మ్యాచ్లు ఆడెందుకు సిద్ధమయ్యారు. అయితే మొన్నటి వరకు కెప్టెన్ టీమ్ ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ లేకపోవడంతో యువ ఆటగాళ్లు యశస్వి జైష్వాల్ గిల్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఇక ఎప్పుడు రోహిత్ వచ్చిన నేపథ్యంలో ఈ ఇద్దరు ప్లేయర్లలో ఎవరిపై వేటు వేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇదే విషయం గురించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక రోహిత్ కు ఓపెనర్ గా యంగ్ ప్లేయర్ జైశ్వాల్ బలిలోకి దిగబోతున్నారు తెలుస్తోంది.

 ఈ క్రమంలోనే గిల్ పై వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా తెలిపాడు. ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీమ్ ఇండియా ఓపెనింగ్ కాంబినేషన్ పై ద్రావిడ్ కు ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు ద్రవిడ్. యశస్వి జైస్వాల్ రోహిత్ కు జోడిగా ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు అంటూ చెప్పుకొచ్చాడు. జైశ్వాల్ పై తమకు పూర్తిగా నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. తద్వారా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ దొరుకుతుందని ఇది టీమిండియా కు ఉపయోగపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అద్భుతమైన ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉన్నప్పుడు అందరికీ కొన్ని సార్లు అవకాశాలు రాకపోవచ్చు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: