టి20 వరల్డ్ కప్ లో.. ఆ ఇద్దరు తప్పకుండా ఆడాల్సిందే : మాజీ సెలెక్టర్

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీం గా కొనసాగుతున్న భారత జట్టుకు గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ గెలవడం అనేది కేవలం కలగానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో 2011లో వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా ఇప్పటివరకు ఒక్కసారి కూడా  ఐసీసీ ట్రోఫీని అందుకోలేకపోయింది. అయితే ప్రతిసారి కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ.. ఇక మంచి ప్రదర్శనలు చేసే టీమ్ ఇండియా కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో మాత్రం చేతులెత్తేసి నిరాశ పరుస్తూ ఇంటి బాటపడుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇదే జరిగింది.

 దాదాపుగా టీమిండియా వరల్డ్ కప్ అందుకుంది అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అప్పటి వరకు వరుస విజయాలు సాధిస్తూ దూసుకు వచ్చిన టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్లో మాత్రం తడబాటుకు గురైంది. ఈ క్రమంలోనే టీమిండియా ఓటమిపై భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇక ఇప్పుడు 2024 t20 వరల్డ్ కప్ లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అయితే ఇక ఈ వరల్డ్ కప్ లో సీనియర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఆడతారా లేదా అనే విషయంపై కన్ఫ్యూజన్ నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు.

 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీలు ఇద్దరు కూడా టి20 వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటే.. వారిని కచ్చితంగా టీంలోకి తీసుకోవాలి అంటూ మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వారిద్దరూ లేకుండానే బీసీసీఐ టీం ను సెలెక్ట్ చేయబోతుంది అన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే చివరి పొట్టి ఫార్మాట్ కప్ లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు. వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ ఎలా ఆడాడో మనం చూసాం. అందుకే ఈ ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ కు ఈ ఇద్దరిని తప్పకుండా జట్టులోకి తీసుకోవాల్సిందే అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: