స్పిన్ తిరిగితే చెత్త.. ఫేస్ పడితే గొప్పా.. విరుచుకుపడ్డ గవాస్కర్?

praveen
సుదీర్ఘమైన ఫార్మాట్ ను టెస్టు ఫార్మాట్ అని పిలుస్తూ ఉంటారు. ఒక్క మ్యాచ్ దాదాపుగా నాలుగు రోజులపాటు జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల కేఫ్ టౌన్ వేదికగా సౌత్ఆఫ్రికా, ఇండియా జట్ల మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ మాత్రం ఇక రెండు రోజుల్లోనే ముగియడం హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ క్రమంలోనే కేప్ టౌన్పిచ్ బీచ్ గురించి రచ్చ రచ్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లేవనెత్తిన విషయాలు మాత్రం సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి. ఇక రోహిత్ కామెంట్స్ కి అటు భారత మాజీ గావాస్కర్ కూడా మద్దతు తెలిపాడు.

 భారత్లో ఇలాంటి ఒక టెస్ట్ మ్యాచ్ జరిగి పిచ్ స్పిన్ కి అనుకూలించి ఒకటిన్నర రోజులోనే మ్యాచ్  ముగిసిపోతే భారతదేశంలో పిచ్ లన్ని కూడా నాసిరకం చెత్తవి అని కామెంట్లు చేస్తారు. అదే విదేశాల్లో ఫేస్ కు అనుకూలించి ఒకటిన్నర  రోజులోనే మ్యాచ్ ముగిసిపోతే మాత్రం ఇంత గొప్ప పిచ్ మరొకటి లేదు అని అంటారు. ఒకవేళ టీమిండియా బ్యాట్స్మెన్లు చేతులెత్తేస్తే వీళ్లకు ఫేస్ బౌలింగ్ ఆడటం చేతకాదు అని మాట్లాడతారు. అదే స్పిన్ బౌలింగ్కు విదేశీ బ్యాట్స్మెన్లు అవుట్ అయితే మాత్రం వాళ్ళ తప్పులేదు పిచ్ తప్పు అన్నట్లుగా మాట్లాడతారు అంటూ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 నేను ఆడినప్పుడు ఇలాంటివి ఎన్నో చూశానని చెప్పుకొచ్చాడు గావాస్కర్. ఎందుకులే ఇలాంటి వివాదాస్పద అంశాల్లో తల దూర్చలేదు. ఒకవేళ మాట్లాడితే అది నా వ్యక్తిగత అభిప్రాయంగా ఉండదు. దేశానికి ప్రతినిధిగా మొత్తం భారతదేశానికి అంతటికి కూడా ఆపాదిస్తారు అని నోరు మూసుకొని కూర్చున్నాము అంటూ  చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల ఆటగాళ్లు మీడియా ప్రతినిధులు సౌతాఫ్రికా పిచ్  పై స్పందించాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. భారతదేశంలోని పిచ్ లని విమర్శించడం ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ గా మారిపోయింది అంటూ విరుచుకుపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: