చరిత్ర సృష్టించిన బీహార్ క్రికెటర్.. అతిపిన్న వయసులో రంజీల్లోకి?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఎవరైనా సీనియర్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇక అతని లాంటి ప్లేయర్ కోసం ఎన్నో రోజులపాటు వెతికే వాళ్ళు. కానీ ఇటీవల కాలంలో సీనియర్లు జట్టులో ఉండగానే ఏకంగా వారిని మించిన ప్రతిభతో కొత్త ప్లేయర్లు తెరమీదకి వస్తూనే ఉన్నారు. దీంతో ఇక ఎప్పటికప్పుడు సీనియర్ల కెరియర్ అటు ప్రమాదంలో పడిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. యువ ఆటగాళ్ళు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతున్నారు.

 ఈ క్రమంలోనే ఐపీఎల్ సహా ఇక భారత జట్టు తరఫున కూడా ఎంతోమంది ఆటగాళ్లు అరంగేట్రం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే భారత్లో ఐపీఎల్ అత్యుత్తమ టోర్ని అని చెబుతూ ఉంటారు. ఐపీఎల్ తర్వాత ఇక దేశవాళీ క్రికెట్లో ప్రతి ప్లేయర్ కూడా భాగం కావాలని కోరుకునే టోర్ని ఏదైనా ఉంది అంటే అది రంజీ ట్రోఫీ అని చెప్పాలి. ఇక ఇప్పుడైతే ఐపీఎల్ వచ్చి రంజీ ట్రోఫీకి కాస్త క్రేజ్ తగ్గింది. కానీ ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ తర్వాత ఇక రంజీ ట్రోఫీకే ఇండియాలో ఎక్కువగా గుర్తింపు ఉండేది. ఇప్పటికీ కూడా ఎంతోమంది ఆటగాళ్లు ఇక రంజీ ట్రోఫీలో భాగం కావాలని ఆశ పడుతూ ఉంటారు.

 అయితే ఇటీవలే ఏకంగా రాంజీ ట్రోఫీలో అవకాశం దక్కించుకున్న బీహార్ క్రికెటర్ చరిత్ర సృష్టించాడు. అదేంటి చాలామంది ప్లేయర్లు ఈ టోర్నీలో అవకాశం దక్కించుకుంటారు. ఇందులో కొత్తేముంది అంటారా.. అయితే అత్యంత పిన్నవయసులో రంజీలలో అరంగేట్రం చేసిన ప్లేయర్గా నిలిచాడు బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి. 12 సంవత్సరాల 284 రోజులకే ఇక రంజీల్లో బీహార్ తరపున ఎంట్రీ ఇచ్చాడు. గతంలో మరో ముగ్గురు ప్లేయర్స్ కూడా పిన్నా వయసులోనే రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలీముద్దీన్ 12 సంవత్సరాల 73 రోజులు, ఎస్కే బోస్ 12 సంవత్సరాల 76 రోజులు, మహమ్మద్ రంజాన్ 12 సంవత్సరాల 247 రోజులు పిన్నవయసులో రంజీల్లోకి అరంగేట్రం చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: