ఒరేయ్.. నా వెంట పడ్డావేంట్రా.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచంలో నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు  ఇక సోషల్ మీడియా కారణంగా సామాన్యులకు సెలబ్రిటీలకు తేడా అనేది లేకుండా పోయింది. ఏదైనా తేడా ఉంది అంటే కేవలం ఒక బ్లూటిక్ మాత్రమే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఈ క్రమంలోనే ఎక్కడ ఏం జరిగినా కూడా దానిని సెల్ఫోన్ లో వీడియో తీసి ఇక దానిని సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేస్తున్నారు అందరు.

 ఈ క్రమంలోనే ప్రతిరోజు కూడా ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా వీడియోలు ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఇక కొన్ని వీడియోలు అందరిని కడుపుబ్బాని నవ్విస్తే.. ఇంకొన్ని భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన ఒక వీడియో చూస్తే మాత్రం నవ్వకుండా అస్సలు ఉండలేరు. ఏకంగా ఒక చిన్నారి తన నీడను చూసి తానే భయపడ్డాడు. ఆ చిన్నారి భయపడిన తీరు చూసి నేటిజన్స్ అందరూ కూడా తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి.

 వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే ఒక చిన్నారి రోడ్డుపై నడుస్తూ ఉంటుంది. ఇక మధ్యాహ్నం సమయం కావడంతో ఆ చిన్నారి పక్కనే ఇక అతని నీడ కూడా అతని వెంటే వస్తుంది. అయితే తన నీడను చూసి తనను ఎవరో వెంబడిస్తున్నారు అని భయపడిపోతుంది చిన్నారి. అయితే ఇక చిన్నారి ఎటు వెళ్లినా కూడా నీడ వెంటే వస్తూ ఉండడంతో మరింత భయపడిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ చిన్నారి అమాయకత్వాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: