సౌత్ ఆఫ్రికాపై.. భారత బౌలర్ల అత్యుత్తమ గణాంకాలు ఇవే?

praveen
ప్రస్తుతం భారత్ సౌతాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో అటు సౌత్ ఆఫ్రికా జట్టు ఘన విజయాన్ని సాధించింది. పటిష్టమైన టీమిండియాని ఓడించి 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో విజయం అందుకుంది సౌత్ ఆఫ్రికా జట్టు. అయితే ఘోర పరాజయం పాలైన టీమ్ ఇండియా పై తీరుస్తాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి  ఇక ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండో టెస్ట్ కూడా ప్రారంభమైంది. కేప్ టౌన్ వేదికగా ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్లో అసలేం జరుగుతుందో చూస్తున్న ప్రేక్షకులకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

 ఎందుకంటే ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా కేవలం 55 పరుగులకే పరిమితమై ఆలవుటయింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా సైతం 153 పరుగులు చేసింది. చివర్లో ఇక ఒక్క పరుగు కూడా నమోదు అవ్వకుండానే ఆరుగురు బ్యాట్స్మెన్లు డక్ అవుట్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా రెండవ టెస్ట్ మ్యాచ్లో పరిస్థితులు చూస్తూ ఉంటే ఇరుజట్ల పేసర్లకు కేప్ టౌన్ వేదిక స్వర్గధామంగా మారిపోయింది అన్నది తెలుస్తుంది.. అయితే ఇక రెండవ టెస్టు మ్యాచ్లో టీమిండియా కీలక బౌలర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

 ఏకంగా 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు సిరాజ్. ఒకరకంగా సౌతాఫ్రికాను అతి తక్కువ పరుగులకు పరిమితం చేయడంలో అతనే కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్టుల్లో గతంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు చూసుకుంటే..
 2022లో జోహేర్నెస్ బర్గ్ వేదికగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో 7/61 గణాంకాలతో శార్దూల్ ఠాగూర్ అత్యుత్తమ గణాంకాలు సాధించిన బౌలర్ గా ఉన్నాడు.
 2011లో కేఫ్ టౌన్ లో జరిగిన మ్యాచ్లో 7/128 గణాంకాలతో  హర్భజన్ సింగ్ ఉన్నాడు.
 2024లో కేప్ టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ 6/15. 1992లో జోహేర్నెస్ బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్లో అనిల్ కుంబ్లే 6/53 గణాంకలతో ఉండగా.. 2001లో జవగల శ్రీనాథ్ 6/76 గణాంకాలతో ఉన్నాడు. 2018లో రవీంద్ర జడేజా 6/138 గణాంకాలతో ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇవే సౌత్ ఆఫ్రికా పై భారత ప్లేయర్లు సాధించిన అత్యుత్తమ ఘనంగాలు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: