టెస్ట్ క్రికెట్లో.. భారత్ అత్యంత చెత్త రికార్డు?

praveen
గత కొంతకాలం నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తిరుగులేని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న టీమిండియా.. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మాత్రం చెత్త ప్రదర్శనతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అన్న విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియాకు ఎంతటి ఘోర పరాభవం ఎదురయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది భారత జట్టు. బౌలింగ్లో బ్యాటింగ్లో పూర్తిగా తేలిపోయిన టీమిండియా పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఈ భారీ ఓటమితో ఎన్నో చెత్త రికార్డులు కూడా మూటగట్టుకుంది టీమిండియా. అయితే ఇక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చెత్త ప్రదర్శన చేసినప్పటికీ రెండవ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా పుంజుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన రీతిలో రెండో టెస్టులో కూడా చెత్త ప్రదర్శనలతో నిరాశపరిచింది. ఏకంగా భారత జట్టులోని ఆరుగురు బ్యాట్స్మెన్లు ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ గా వెను తిరగడాన్ని మాత్రం అటు భారత క్రికెట్ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

 అయితే అప్పటికే సౌత్ ఆఫ్రికా జట్టు రెండో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి చెత్త రికార్డింగ్ మూట కట్టుకుంది. ఇక సఫారీ జట్టుకు పోటీగా భారత జట్టు కూడా చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఒక్క పరుగు కూడా చేయకుండా చివరి ఆరు వికెట్లను కోల్పోయింది భారత జట్టు. 153/4 స్కోరు వద్ద ఉన్న భారత జట్టు 11 బంతుల వ్యవధిలోనే ఒక పరుగు కూడా చేయకుండా ఏకంగా ఆరు వికెట్లను కోల్పోవడం గమనార్హం. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, బుమ్రా, విరాట్, సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఇలా ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్  చేరారు. దీంతో అత్యంత చెత్త రికార్డు భారత జట్టు ఖాతాలో చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: