కొత్త ఏడాదిలో.. టీమిండియా ముందు ఉన్న సవాళ్లు ఇవే?

praveen
2024 ఏడాదిలోకి అటు భారత జట్టు కొంగొత్త ఆశలతో అడుగుపెట్టింది. ఎందుకంటే గత ఏడాది చేదు జ్ఞాపకాలను మరిచిపోతూ ఇక కొత్త సవాళ్ళను ఎదుర్కొని సరికొత్త రికార్డులను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అయితే 2023 ఏడాది అటు భారత జట్టుకు నిరాశ మిగిల్చింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తో పాటు.. ఏకంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన   2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా టీమిండియా ఓడిపోయింది. ఇక ఈ రెండు మెగా టోర్నీలో కూడా ఫైనల్ వరకు ఎంతో విరోచితమైన పోరాటం చేసి ఫైనల్ లో తడబాటుకు గురై ఓడిపోయింది అని చెప్పాలి.

 అయితే 2024 ఏడాదిలో మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీతో పాటు టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో భారీ టార్గెట్స్ తోనే కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది టీమిండియా. అయితే 2023 -  25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చక్రంలో విజేతగా నిలవాలంటే భారత్ శక్తికి మించి కష్టపడాల్సిందే. ఇప్పుడు వరకు ఈ సైకిల్ లో మూడు టెస్టులు ఆడిన భారత్ ఒక్క మ్యాచ్లో విజయం సాధించి.. ఒక మ్యాచ్లో ఓటమి మరో మ్యాచ్లో డ్రా తో కొనసాగుతుంది.  38.8 9 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. అయితే ఈ నెలలో స్వదేశంలో ఇంగ్లాండ్తో ఆరంభమయ్యే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఎంతో కీలకమైనది అని చెప్పాలి.

 ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భారీ తేడాతో గెలిచినా లేదంటే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్కు కలిసి వస్తుంది. కానీ ఇంగ్లాండ్ జట్టును టెస్టుల్లో ఓడించడం అనేది అంత సులభైన విషయం కాదు. బజ్ బాలు ఆట తీరుతో ఇంగ్లాండ్ దూకుడు ప్రదర్శిస్తుంది. కొన్నిసార్లు ఓటములు ఎదురైనా తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతుంది ఆ జట్టు. దీంతో ఆ టీం ని ఓడించడం అంటే ఇక భారత జట్టుకి సవాలతో కూడుకున్న విషయమే. అయితే 2007 ఆరంభ సీజన్ తర్వాత మరోసారి టీ20 ప్రపంచ కప్ లో విజేతగా నిలవలేకపోయింది భారత జట్టు. అయితే టీమిండియా కు మరోసారి అవకాశం వచ్చింది. అమెరికా వెస్టిండీస్ లలో ఈ పొట్టి ఫార్మాట్  వరల్డ్ కప్ జరుగుతోంది. అయితే ఈ ప్రపంచ కప్ టోర్నీలో అగ్రశ్రేణి జట్లను ఓడిస్తేనే భారత్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక ఈసారి వరల్డ్ కప్ లో 20 జట్లు పాల్గొనబోతున్నాయి అని చెప్పాలి. దీంతో ఇక కొత్త ఏడాదిలో అటు భారత జట్టుకు మళ్ళీ కఠినమైన సవాళ్లే ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: