కొత్త కెప్టెన్లను తయారు చేయడంపై.. బీసీసీఐ ఫోకస్ పెట్టాలి : ఇర్ఫాన్

praveen
భారత క్రికెట్లో కెప్టెన్సీ మార్పు జరుగుతుందా.? గత కొంతకాలం నుంచి ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2022 t20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ టి20 లకు పూర్తిగా దూరమయ్యాడు. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా టి20 ఆడటం లేదు. ఇక తాత్కాలిక కెప్టెన్ అని చెబుతున్నప్పటికీ 2022 నాటి నుంచి కూడా అటు హార్దిక్ పాండ్యానే టి20 ఫార్మాట్ కెప్టెన్ గా నియమిస్తూ వస్తుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇక అతనికి కెప్టెన్సీ లోనే t20 వరల్డ్ కప్ ఆడతారా లేదా అనే విషయంపై కన్ఫ్యూషన్ నెలకొంది.

 అయితే పేరుకు మాత్రమే ప్రస్తుతం రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉన్నాడు. కానీ అటు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి పెద్దగా అందుబాటులో ఉండడం లేడు. ఇప్పటికే t20 ఫార్మాట్ కు దూరం కాగా.. ఇక సౌతాఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్ కి కూడా దూరంగా ఉన్నాడు. దీంతో అతడు పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతాడా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది అని చెప్పాలి. ఇక ఈ విషయంపై బిసిసిఐ త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని భారత మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 2024లో భారత జట్టులో చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్ళను సిద్ధం చేస్తే టీం ఇండియాకు పెద్దగా ఇబ్బందులు ఉండవు అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్లుగా ఎవరిని సిద్ధం చేస్తారు అనే దానిపై బీసీసీఐ ఇప్పటినుంచే దృష్టి పెట్టాలి. టెస్టుల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో భారత జట్టు ఐదేళ్లుగా అద్భుతంగా ఆడింది  నెంబర్ వన్ ర్యాంకును కూడా దక్కించుకుంది. అతను చక్కటి ఫిట్నెస్ తో వున్నాడు  ప్రతి మ్యాచ్ లో కూడా రాణించడంతోపాటు జట్టు నుంచి మంచి ప్రదర్శన రాబట్టగలడు. రోహిత్ శర్మ నాయకత్వంలో కూడా టీమిండియా మంచి ఫలితలు సాధించింది. ప్రపంచకప్లో భారత్ ఎలా ఆడిందో చూసాం. అయితే రోహిత్ సాధ్యంలో ఆసియా కప్ కూడా గెలిచాం. కానీ అతని తర్వాత కెప్టెన్ ఎవరు అని ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించాడు. ఇక ఈ ఏడాది టీమిండియా ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: