కొత్త షాట్ ని పరిచయం చేసిన మాక్స్ వెల్.. దీనిని ఏమని పిలువాలో?

praveen
ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో ప్రతి ప్లేయర్ కూడా సాంప్రదాయమైన షాట్లను ఎక్కువగా ఆడేవారు. స్వీప్ షాట్, స్క్వేర్ కట్ లాంటి ఎన్నో షాట్లు ఉండేవి. కానీ నేటితరం క్రికెటర్లలో చాలామంది ఇలా సాంప్రదాయమైన షాట్లకు స్వస్తి పలికి వినూత్నమైన షాట్లను అటు వరల్డ్ క్రికెట్ కి పరిచయం చేసారు అని చెప్పాలి. అలాంటి ఆటగాళ్లలో అటు దక్షిణాఫ్రికా దిగ్గజం ఎ బి డివిలియర్స్ ఒకరు అయితే ఇక ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మాక్స్వెల్ కూడా ఒకరు అని చెప్పాలి.

 మైదానం నలువైపులా ఎంతో అలవోకగా బ్యాటింగ్ చేయగల ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు.. ఇక క్రికెట్ ప్రపంచానికే తెలియని సరికొత్త షాట్లను కూడా పరిచయం చేశారు. ఇటీవల కాలంలో ఈ సరికొత్త షాట్లను అటు భారత స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పటికే వినూత్నమైన షాట్స్ తో ప్రపంచ క్రికెట్ కి పరిచయం చేయగా.. ఎప్పటికప్పుడు ఇంకా కొత్త షాట్లను కనుగొంటూనే ఉంటారు. ఇలాంటి కొత్త షాట్ తో అగరగొట్టాడు ఈ షాట్ కి ఏం పేరు పెట్టాలో కూడా తెలియక.. ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా కన్ఫ్యూజన్లో మునిగిపోయారు అని చెప్పాలి.

 మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో మెరుపు ఇన్నింగ్స్ లతో అదరగొట్టిన మాక్స్వెల్ ఇక ఇప్పుడు బిగ్ బాష్ లీగ్ లో కూడా అదే విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా ఇటీవల స్కూప్, రివర్స్ షాట్ కలగలిపి మ్యాక్సీ బంతిని బౌండరీకి తరలించాడు. ఇటీవల మెల్బోర్న్ రెనిగేట్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ఓ 15 బంతుల్లో 32 పరుగులు చేసాడు మాక్స్వెల్. అయితే ఒక బంతిని వినూత్నమైన రీతిలో షాట్ కొట్టాడు. ఏకంగా స్కూప్, రివర్స్ స్వీప్ షాట్ ని కలగలిపి మాక్స్వెల్ బంతిని బౌండర్కు తరలించగా.. ఇక ఈ కొత్త షాట్ ను ఏమని పిలవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: