అది నాకు చాలా సెంటిమెంట్.. ప్లీజ్ తిరిగిచ్చేయండి : వార్నర్

praveen
సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించి ఏదైనా విషయం వెలుగులోకి వచ్చింది అంటే చాలు అది కాస్త తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు డేవిడ్ వార్నర్ కు సంబంధించిన ఒక విషయం ఇలాగే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా డేవిడ్ వార్నర్ కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వస్తువు చోరీకి గురైంది. దీంతో అది తనకు సెంటిమెంట్ అని తిరిగి ఇచ్చేయాలి అంటూ డేవిడ్ వార్నర్ రిక్వెస్ట్ చేశాడు అని చెప్పాలి. దీంతో  ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా డేవిడ్ వార్నర్ గురించి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ స్టార్ ప్లేయర్ తన కెరియర్ ముగింపుకు సిద్ధమయ్యాడు అని చెప్పాలి. పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటాను అంటూ ప్రకటించాడు డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే ఇక ఇలా పాకిస్తాన్తో టెస్టు సిరీస్ ముగియకముందే ఊహించని రీతిలో వన్డే ఫార్మాట్ కి కూడా వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఇక వార్నర్ నిర్ణయంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవలే డేవిడ్ వార్నర్ ఎంతో ఇష్టమైన వస్తువుని పోగొట్టుకున్నాడు. మూడవ టెస్ట్ కోసం అతను సిద్ధమవుతూ ఉండగా.. అతని బ్యాక్ ప్యాక్ చోరీకి గురైంది  ఈ క్రమంలోనే అందులో అతనికి సెంటిమెంట్ అయినా గ్రీన్ క్యాప్ కూడా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితమే ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు డేవిడ్ వార్నర్. లగేజ్ నుంచి బ్యాక్ ప్యాక్ చోరీకి గురైంది. అందులో క్యాప్ ఉంది. అది నాకు ఎంతో సెంటిమెంట్. బ్యాక్ ప్యాక్ కావాలంటే వేరేది కొనిస్తాను అంటూ రిక్వెస్ట్ చేశాడు డేవిడ్ వార్నర్. కాగా మెల్ బోర్న్ నుండి సిడ్ని వెళ్తున్న క్రమంలో ఇలా తన బ్యాక్ ప్యాక్ చోరీకి గురైనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: