బుమ్రాకు సరైన సపోర్ట్ దొరకలేదు.. అందుకే అలా : మాజీ కోచ్

praveen
ప్రస్తుతం భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఒక్కసారి కూడా సఫారీ గడ్డపై టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ లో విజయం సాధించలేదు. ఇక ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ లో తెరపడుతుంది అని అందరూ భావించారు. ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న భారత సౌత్ ఆఫ్రికా గడ్డపై సఫారీ జట్టును చిత్తు చేసి టెస్టు సిరీస్ గెలుస్తుంది అని అందరూ ఊహించారు..

 కానీ ఊహించని రీతిలో భారత జట్టు అందరి అంచనాలను తారుమారు చేసింది. ఎంతో పటిష్టంగా కనిపించిన భారత జట్టు సఫారీ గడ్డపై పూర్తిగా తేలిపోయింది  బ్యాటింగ్ విభాగంలోనే కాదు బౌలింగ్ విభాగం లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అని చెప్పాలి. ఏకంగా భారత బౌలర్లు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ల ముందు తేలిపోయి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో టీమ్ ఇండియాకు ఘోర పరాభవం తప్పులేదు. ఏకంగా 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది భారత జట్టు. అయితే ఇక ఇప్పుడు రెండో టెస్టులో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది.

 ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ప్రదర్శన గురించి టీమ్ ఇండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్ట్ మ్యాచ్లో భారత బౌలర్లు తేలిపోయిన సంగతి తెలిసిందే. అయితే బుమ్రా సిరాజ్ పరవాలేదు అనిపించగా.  శార్దూల్ ఠాగూర్, ప్రసిద్ కృష్ణ పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఈ విషయంపై భరత్ అరుణ్ మాట్లాడుతూ బౌలర్లు మరీ ఎక్కువ బౌండరీలు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పరిస్థితుల కైనా త్వరగా అలవాటు పడాలి. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ మిగతావారి నుంచి అతనికి సరైన సపోర్ట్ లభించలేదు అంటూ భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: