టెస్ట్ క్రికెట్ భవితవ్యంపై.. రోహిత్ కీలక వ్యాఖ్యలు?

praveen
పరిమిత వర్ల ఫార్మాట్ కి ప్రపంచ క్రికెట్లో ఆదరణ రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో.. టెస్ట్ ఫార్మాట్ భవితవ్యం ప్రమాదంలో పడిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పటిలా అటు సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్ ను ఆదరించే ప్రేక్షకుల సంఖ్య కూడా ఒకరోజు రోజురోజుకు తగ్గిపోతుంది. ఏకంగా టెస్ట్ మ్యాచ్ లు జరుగుతున్న స్టేడియాలలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి తప్ప ఇక ఈ టెస్ట్ మ్యాచ్లను చూసేందుకు ప్రేక్షకులు ఎవరు కూడా పెద్దగా ఆసక్తిని కనపరచడం లేదు. ఇలాంటి సమయంలో ఇక టెస్ట్ క్రికెట్ భవితవ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఇక టెస్ట్ క్రికెట్కు కనుమరుగు అవుతున్న ఆదరణను పెంచేందుకు ఇక ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారూ అని చెప్పాలి. ఇలాంటి సమయంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఇటీవల చేసిన పని అందరికీ కోపం తెప్పించింది. ఏకంగా న్యూజిలాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం ద్వితీయ ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా సాదరణంగా టెస్ట్ క్రికెట్ అనగానే సీనియర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఏకంగా ఇటీవల ఎంపిక చేసిన జట్టులో ఏడు మంది అని క్యాప్డు ప్లేయర్లకు అవకాశం కల్పించింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.

 ఇప్పటికే టెస్ట్ క్రికెట్ మనుగడ  ప్రమాదంలో పడిపోతున్న ఇప్పుడు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చేసిన పని అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంది. ఇదే విషయంపై స్పందించిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకోచాడు. అయితే ఇది ఒకటి రెండు దేశాలతో సాధ్యం కాదు అంటూ హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. ప్రపంచంలో టెస్ట్ ఆడ దేశాలు అన్నీ కూడా బాధ్యతగా వ్యవహరించాలి అంటూ సూచించాడు. అభిమానులను అలరించాల్సిన బాధ్యత ఇక అటు క్రికెటర్ల పై ఉంది అంటూ గుర్తు చేశాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: