చిన్నారికి శ్వాస కోశ సమస్య.. వాతలు పెట్టిన కుటుంబ సభ్యులు.. చివరికి?

praveen
దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. ఇలా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో మనిషి జీవితంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో ఒకప్పటి మూఢనమ్మకాలను వదిలేసిన జనాలు.. ఇక టెక్నాలజీ వెంటే పరుగులు పెడుతున్నారు అని చెప్పాలి. అయితే నేటి ఆధునిక సమాజంలో కూడా ఇంకా అక్కడక్కడ మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోయిన మనుషులు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతూ ఎంతోమంది బురిడీ బాబాల మాయలో పడిపోతున్నారు జనాలు. చివరికి నిండా మోసపోయి లబోదిబోమంటున్నారు. అధికారులు ఎంతల అవగాహన కల్పించిన జనాలు తీరులో మార్పు రావట్లేదు.

 జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లడం మానేసి.. ఏకంగా బాబాల దగ్గరికి వెళ్లి తాయత్తును కట్టించుకుంటున్న అమాయకపు జనాలు ఇంకా తారసపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలా మూఢనమ్మకాల ముసుగులో కూరుకుపోయి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనల కూడా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇలా వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా అక్కడక్కడ దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి.

 షాక్ డోల్ జిల్లాలో ఒకటిన్నర నెల వయసున్న శిశువును చివరికి మూఢనమ్మకాలతో ప్రాణం తీసేసారు. ఆ శిశువుకి శ్వాస కోస వ్యాధి వచ్చింది. అయితే దానిని నయం చేసేందుకు డాక్టర్ దగ్గరికి వెళ్లలేదు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎర్రగా కాల్చిన ఇనుపరాడ్డుతో శిశువు శరీరంపై వాతలు పెట్టారు. దీంతో పసిపిడ్డ ఆరోగ్యం మరింత క్షీణించింది. అయితే వెంటనే ఇక ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ చివరికి చిన్నారి మరణించింది. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: